అందాల ముద్దుగుమ్మ అనుష్క టాలీవుడ్
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. బొమ్మాళిగా తన కంటూ ఓ
ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్వీటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా
ఉంది. అయితే ఆఫర్లు వస్తున్నా కేవలం రెండు ప్రాజెక్టులకు మాత్రమే సైన్
చేసిన అనుష్క ఈ రెండు ప్రాజెక్టుల తరువాత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు
వచ్చిన విషయం తెలిసిందే. అయితే వరుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు. కానీ
ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క హైదరాబాద్ కోడలు కాబోతుందని
అంటున్నారు.
పెళ్లి కొడుకు హైదరాబాద్ కి చెందిన ఓ పెద్ద వ్యాపారవేత్తతో
జరగబోతుందని, ఇప్పటికే ఈ వియషం పై ఇరు వర్గాల పెద్దలు చర్చలు జరిపారని
అంటున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళు బాహాటంగా చెప్పకపోయినా అనుస్క
సన్నిహితులు మాత్రం ఠాం ఠాం చేస్తున్నారట. ఇప్పటికే స్వీటీకి పెళ్లి వయసు
దాటేయడంతో ఇంట్లో వాళ్ళు తొందర పెట్టడం, అనుష్క కూడా పెళ్లి చేసుకొని
మద్దు ముచ్చట తీర్చుకోవాలని అనుకోవడంతో ఒప్పుకున్న సినిమాలు అయిపోయిన
తరువాత మెడలో మూడుముళ్ళు వేయించుకుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా అనుష్క హైదరాబాద్ కోడలుగా రావడం సంతోషించదగ్గ విషయమే.
No comments:
Post a Comment