టాలీవుడ్
హీరోయిన్ సంగీత వెండి తెరపై కన్పించింది కొద్ది రోజులే అయిన ..
కుర్రకారును మాత్రం తన చుట్టు తిప్పుకుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’లో ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ కుర్రకారు గుండెల్ని పిండేసిన ముద్దుగుమ్మ సంగీత బుల్లితెరపై అడుగుపెడుతోంది. నవ్వుకి నవ్వు, డబ్బుకి డబ్బుని కలగలిపి ‘బిందాస్’ పేరుతో
జీ తెలుగు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 6నుంచి ఈ
కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న గేమ్‌షోలలోనే
విభిన్నతనీ, విలక్షణతనీ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ‘బిందాస్’ రూపొందిందనీ, ఈ కార్యక్రమంలో వెండితెర, బుల్లితెర
నటీనటులు పాల్గొని ఆనందాన్ని పొందుతూ ప్రేక్షకులకు వినోదాన్ని
పంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలకన్నా
విభిన్నంగా ప్రతి రౌండు కేవలం ఒకే ఒక్క రూపాయితో మొదలై, రౌండు ముగిసేసరికి ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు గెలుపొందే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది.
ప్రతి ఎపిసోడ్‌లోనూ ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి మూడు జంటలుగా పాల్గొంటారు. సంగీత ‘బిందాస్’ కార్యక్రమం
అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ ఆద్యంతం వినోదాన్ని అందిస్తూ
ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నదని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్ర మం
ప్రతి బుధవారం రాత్రి 9.30 గం.లకు ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. అయితే
ఇప్పటికే బుల్లి తెరపై టాలీవుడ్ నటిమణులు చాలా మంది ఉన్నారు, అందాల
రాశి, రోజా, ఖుష్బు, ఆమని, రమ్యక్రిష్ణ, సిమ్రాన్, రవళి, లాంటి
హీరోయిన్లు బుల్లి తెరపై వారి సత్తా ఏమిటో బుల్లితెర ప్రేక్షకులకు
చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్త సంగీత ఏం చూపిస్తుందో చూడాలి?
No comments:
Post a Comment