Tuesday, 21 May 2013

Shraddha Das Waiting For Rey Movie Release

Shraddha Das Waiting For Rey Movie Release

Shraddha Das waiting for Rey movie release.png

ఎప్పుడో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన శ్రద్ధాదాస్ కేవలం అందాలను నమ్ముకొని ఉన్న అందాలన్నీ ఆరబోసి పేడ్ అయి సరైన అవకాశాలు లేక ఒకటి అర సినిమాలతో కాలం వెల్లదీస్తున్న శ్రధ్దాదాస్ ఆ మధ్య హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమాయణం నడిపి మోసపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు వైవీయస్ చౌదరి తీస్తున్న ‘రేయ్ ’ సినిమాలో లేడీ విలన్ పాత్ర పోషిస్తుంది. 


ఇన్నాళ్ళు గ్లామర్ ఒలక బోసిన ఈ అమ్మడు తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదట. కరాటేలో మంచి ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా బ్లాక్ బెల్టు కూడా సంపాదించింది. ఇప్పుడు విలన్ పాత్ర పోషించే అవకాశం రావడంతో ఇందులో తానేంటో చూపిస్తానని అంటుంది. ఈ సినిమా విడుదల అయితేకానీ తెలియదు శ్రధ్దా ఏ మాత్రం చూపించిదనేది.


Thursday, 16 May 2013

Laxmi Rai Latest In Item Songs


 


 Laxmi Rai Latest In Item Songs
 

Laxmi rai latest in item songs.png

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏ గ్రేడ్ హీరోయిన్ల నుండి బి గ్రే హీరోయిన్ల వరకు అందరు అవకాశం దొరికితే ఐటెం భామలుగా, వేశ్యలుగా అవతారం ఎత్తేస్తున్నారు. ఇండస్ట్రీలో రోజు రోజు పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని అయినా వదులుకోవడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఛార్మి, శ్రేయ వంటి వాళ్ళు ఇటు వేశ్యలుగా, ఐటెం భామలుగా రాణిస్తున్నారు. తాజాగా మరో హాట్ భామ కూడా ఐటెం అవతారం ఎత్తింది. తాజాగా ఈమె మాజ్ రాజా రవితేజ్ నటిస్తున్న ‘బలుపు ’ సినిమాలో ఐటెం భామగా ఎంపిక అయింది.  ఈ పాట కోసం భారీ మొత్తంలో పారితోషికం కూడా పుచ్చుకుంటోందట ఈ ముద్దుగుమ్మ . 

ఒక్క రవితేజ సినిమాలోనే కాకుండా సిద్దార్థ్ నటిస్తున్న సినిమా కోసం కూడా లక్ష్మీ రాయ్ నే ఎంపికచేశారు. శంకర్ శిష్యుడు వసంత్ బాలన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తీయబోయే సినిమాలో కూడా ఈమెను ఐటెం సాంగుకు సెలక్ట్ చేశారట. వెండితెర పై అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడని ఈ అమ్మడును వరుస సినిమాల్లో ఎంపిక చేశారంటే డిమాండ్ బాగానే పెరిగిందన్న మాట. ఈ భామ ప్రస్తుతం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'రాణీ రాణమ్మ' సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాలన్నింటిలో ఐటెం భామగా హిట్ అయితే గనుక హీరోయిన్ కంటే ఐటెం భామగా సెటిల్ అయిపోవడమే మంచిదని సూచిస్తున్నారు సినీ జనాలు.




Samantha Marrige Issue In Tollywood

Samantha Marrige Issue In Tollywood

samantha marrige issue in tollywood.png

గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ బ్యూటీ సమంతా హీరో సిదార్థతో ప్రేమలో పడిందని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల ఇన్ని రోజుల నుండి సిద్దూ కానీ, సమంతాకానీ స్పందించలేదు. తాజాగా సమంతా ఈ వార్తల పై స్పందిస్తూ.... ఎక్కడ చూసినా నా పెళ్లి గురించే చర్చరించుకుంటున్నారు ... కానీ నేను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాను. ఆ సినిమాలు పూర్తయ్యే సరికి కనీసం రెండేళ్ళు పట్టవచ్చు. 

ఇప్పుడున్న పరిస్థితులలో నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నేను ఎవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననేది అప్పుడు చెబుతాను అప్పటి వరకు నా మీద రాతలకు పుల్ స్టాప్ పెట్టండి అని చెప్పింది. మరి సమంతా మాటలను మీడియా వారు పట్టించుకుంటారో లేదో చూడాలి.




Anchor Maria Rao For Gabbar Singh 2 Item Song

 Anchor Maria Rao For Gabbar Singh 2 Item Song
 
IPL Anchor Maria Rao for Gabbar Singh 2 item Song.png

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్ - 2’ చిత్రంలో సంపత్ నంది దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ప్రక్కన ఓ యాంకర్ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్ ’లో కెవ్వు కేక అనే ఐటెం సాంగు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. 

ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఇందులో కూడా అలాంటి మసాలా కలిగిన ఓ ఐటెం సాంగు ఉండేలా చూసుకున్నాడట సంపత్ నంది. ఈ పాట కోసం ఓ కొత్త భామను ఎంపిక చేశాడట. ఆమె ఎవరో కాదు ఐపీఎల్ - 6 లో యాంకర్ గా అదరగొట్టిన రోచెల్లీ మారియా రావ్ ను ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో మల్లికా షెరావత్ ఐటెం సాంగులో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హట్ యాంకర్ ఐటెం భామగా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Shilpa Shetty In Shock After Spot Fxing Charges

 Shilpa Shetty In Shock After Spot Fxing Charges
 
శ్రీశాంత్ అరెస్ట్ విషయం తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని ఆశ్చర్యపోయారు. శ్రీశాంత్ పై ఇలాంటివి రావటం చాలా దారుణం అని ఆమె అన్నారు. అయితే శ్రీశాంత్ పై వచ్చిన ఆరోపణలకు మేము పరిశీలిస్తామని శిల్పాశెట్టి అన్నారు. ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ అరెస్ట్ తమకు ఆశ్చర్యం కలిగించిందని రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని శిల్పాశెట్టి అన్నారు. పోలీసుల విచారణకు అన్నివిధాల సహరిస్తామని ఆమె తెలిపారు. కాగా స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. పక్కా ఆధారాలతోనే అరెస్టులు చేశామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్లపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కఠినచర్యలు తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.

Wednesday, 15 May 2013

Ram Charan To Pair With Samantha And Catherine Tresa

Ram Charan To Pair With Samantha And Catherine Tresa

రణ్ కొత్త సినిమా హీరోయిన్లు వీరే ?


Ram Charan to pair with Samantha- Catherine.png

తొలి సినిమా తోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శక, రచయిత అయిన కొరటాల శివ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రామ్ చరణ్ సరసన సమంతా, కేథరీన్ త్రెసా కథానాయికలుగా ఈ ఇద్దరి ముద్దుగుమ్మల్ని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  ఒక వేళ వారు ఒప్పుకొని, కాల్షిట్లు గనుక ఇస్తే వీరిద్దరు చరణ్ తో ఆడి పాడనున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ కెరియర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ నటించే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని సినీ జనాలు అంటున్నారు.

Bollywood Directors Eye Mahesh Babu For Next Movie

Bollywood Directors Eye Mahesh Babu For Next Movie

Bollywood directors eye Mahesh Babu for next.png


టాలీవుడ్ లో బిజీ హీరో అయిన మహేష్ బాబు త్వరలో బాలీవుడ్  దర్శకులతో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు దర్శకులు అయిన రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే బాలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ హీరోగా 'గో గోవా గాన్' అనే సినిమాను తెరకెక్కించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత ఏ విధంగా  చెడిపోతుందనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగులో అరంగ్రేటం చేయాలని భావిస్తున్న వీరు ఇటీవలే భారీ యాక్షన్, ఎంటర్ టైన్ తో కూడిన కథను మహేష్ కి వినిపించారట. 

Krishna DK and Raj Nidimoru, known for helming films such as �Shor In the City and Go Goa Gone are keen to direct Telugu superstar Mahesh Babu.

ఈ కథ విన్న మహేష్ కి స్టోరీనే కాకుండా, గో గోవా గాన్' ప్రచార చిత్రాలు మహేష్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయట. దీంతో వీరితో నటించేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం నగర్ జనాల నుండి అందిన సమాచారం. ప్రస్తుతం వారు చేస్తున్న సినిమా పూర్తవగానే మహేష్ తో సినిమా చేయడానికి హైదరాబాద్ వస్తారట.