Shilpa Shetty In Shock After Spot Fxing Charges
శ్రీశాంత్ అరెస్ట్ విషయం తెలుసుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని ఆశ్చర్యపోయారు. శ్రీశాంత్ పై ఇలాంటివి రావటం చాలా దారుణం అని ఆమె అన్నారు. అయితే శ్రీశాంత్ పై వచ్చిన ఆరోపణలకు మేము పరిశీలిస్తామని శిల్పాశెట్టి అన్నారు. ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై శ్రీశాంత్ అరెస్ట్ తమకు ఆశ్చర్యం కలిగించిందని రాజస్థాన్ రాయల్స్ జట్టు యజమాని శిల్పాశెట్టి అన్నారు. పోలీసుల విచారణకు అన్నివిధాల సహరిస్తామని ఆమె తెలిపారు. కాగా స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరిన్ని అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ తెలిపారు. పక్కా ఆధారాలతోనే అరెస్టులు చేశామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్లపై నిషేధం విధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై కఠినచర్యలు తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది.
No comments:
Post a Comment