Laxmi Rai Latest In Item Songs
సినిమా
ఇండస్ట్రీలో ఉన్న ఏ గ్రేడ్ హీరోయిన్ల నుండి బి గ్రే హీరోయిన్ల వరకు అందరు
అవకాశం దొరికితే ఐటెం భామలుగా, వేశ్యలుగా అవతారం ఎత్తేస్తున్నారు.
ఇండస్ట్రీలో రోజు రోజు పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి వచ్చిన ఏ
అవకాశాన్ని అయినా వదులుకోవడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో ఛార్మి, శ్రేయ
వంటి వాళ్ళు ఇటు వేశ్యలుగా, ఐటెం భామలుగా రాణిస్తున్నారు. తాజాగా మరో హాట్
భామ కూడా ఐటెం అవతారం ఎత్తింది. తాజాగా ఈమె మాజ్ రాజా రవితేజ్ నటిస్తున్న
‘బలుపు ’ సినిమాలో ఐటెం భామగా ఎంపిక అయింది. ఈ పాట కోసం భారీ మొత్తంలో
పారితోషికం కూడా పుచ్చుకుంటోందట ఈ ముద్దుగుమ్మ .
ఒక్క రవితేజ సినిమాలోనే
కాకుండా సిద్దార్థ్ నటిస్తున్న సినిమా కోసం కూడా లక్ష్మీ రాయ్ నే
ఎంపికచేశారు. శంకర్ శిష్యుడు వసంత్ బాలన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో
తీయబోయే సినిమాలో కూడా ఈమెను ఐటెం సాంగుకు సెలక్ట్ చేశారట. వెండితెర పై
అందాలు ఆరబోయడానికి ఏ మాత్రం వెనకాడని ఈ అమ్మడును వరుస సినిమాల్లో ఎంపిక
చేశారంటే డిమాండ్ బాగానే పెరిగిందన్న మాట. ఈ భామ ప్రస్తుతం తెలుగులో కోడి
రామకృష్ణ దర్శకత్వంలో 'రాణీ రాణమ్మ' సినిమాలో నటిస్తోంది. ఈ
సినిమాలన్నింటిలో ఐటెం భామగా హిట్ అయితే గనుక హీరోయిన్ కంటే ఐటెం భామగా
సెటిల్ అయిపోవడమే మంచిదని సూచిస్తున్నారు సినీ జనాలు.
No comments:
Post a Comment