Showing posts with label telugu cinema. Show all posts
Showing posts with label telugu cinema. Show all posts

Tuesday, 21 May 2013

Shraddha Das Waiting For Rey Movie Release

Shraddha Das Waiting For Rey Movie Release

Shraddha Das waiting for Rey movie release.png

ఎప్పుడో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన శ్రద్ధాదాస్ కేవలం అందాలను నమ్ముకొని ఉన్న అందాలన్నీ ఆరబోసి పేడ్ అయి సరైన అవకాశాలు లేక ఒకటి అర సినిమాలతో కాలం వెల్లదీస్తున్న శ్రధ్దాదాస్ ఆ మధ్య హీరో వరుణ్ సందేశ్ తో ప్రేమాయణం నడిపి మోసపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు వైవీయస్ చౌదరి తీస్తున్న ‘రేయ్ ’ సినిమాలో లేడీ విలన్ పాత్ర పోషిస్తుంది. 


ఇన్నాళ్ళు గ్లామర్ ఒలక బోసిన ఈ అమ్మడు తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదట. కరాటేలో మంచి ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా బ్లాక్ బెల్టు కూడా సంపాదించింది. ఇప్పుడు విలన్ పాత్ర పోషించే అవకాశం రావడంతో ఇందులో తానేంటో చూపిస్తానని అంటుంది. ఈ సినిమా విడుదల అయితేకానీ తెలియదు శ్రధ్దా ఏ మాత్రం చూపించిదనేది.


Saturday, 11 May 2013

Gopichand And Tapsi Hot Romance In Sahasam

Gopichand And Tapsi Hot Romance In Sahasam

sahasam-movie-gopi.gif

గతంలో  తాప్సీ  హీరో గోపీచంద్ తో  మొగుడు అనే సినిమాలో నటించిన అనుభవం ఉండటంతో ..  షూటింగ్ లో  ఈ ఇద్దరు అందరు ముందు  హాట్ సాహసం చేస్తున్నట్లు  టాక్. తాప్సీ కూడా గోపీచంద్  చేసే సాహసమైన పనులకు ఎంతో ఆనందంగా ఉందని టాక్.  ఎంతైన  ఒకప్పటి పాతమొగుడే కదా అని  తాప్సీ కూడా గోపీ చంద్ కు  అడ్డు చెప్పటం లేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే? గోపీచంద్‌, తాప్సీ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహసం'. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రియల్‌ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ' రెగ్యులర్‌ సినిమాలకు విభిన్నంగా కమర్షియల్‌ అంశాలతో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఏ తెలుగు సినిమా చేయని రేర్‌ లొకేషన్ల లో చిత్రీకరించాం. గోపీ,చంద్రశేఖర్‌, మా సంస్థ కి మంచి సినిమా అవుతుంది. మే మొదటి వారంలో పాటలు, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం' అన్నారు. ఇతర పాత్రల్లో శక్తికపూర్‌, ఆలీ తదితరు నటిస్తున్నారు.

Gopichand Sahasam Trailer Gets Good Response

Gopichand Sahasam Trailer Gets Good Response


Gopichand Sahasam trailer gets good response.png

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ చాలా కాలం తరువాత ‘సాహసం ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ పెద్ద సాహసమే చేసినట్లు ఈ సినిమా ట్రైలర్లను బట్టి తెలుస్తుంది. నిధి వేట నేపథ్యంలో సాగే ఈ కథలో గోపీచంద్ చేసిన సాహసాలను చూస్తే బాగానే కష్టపడ్డాని తెలుస్తుంది. ‘ప్రయాణం ’ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీసిన ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతుంది.   ట్రైలర్ సీన్లలో గోపీచంద్ గుర్రపు స్వారీ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ని చూస్తే గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారని తెలుస్తుంది. కొన్ని సీన్స్ లో కౌబాయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు గోపీచంద్. మరి ఈయన కెరియర్ లోనే చాలా సహాసం చేసి ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా జనాల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Ramyasri Coming Back With Hot Movie O Malli

Ramyasri Coming Back With Hot Movie O Malli

 
Ramyasri Coming Back with Hot movie O Malli.png

అందాల సుందరి, హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రమ్య శ్రీ తన ఘాటు అందాలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన విషయం తెలిసిందే. ఈ భాష, ఆభాష అని తేడా లేకుండా  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, భోజ్ పురి ఇలా పలు భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు ఇన్నాళ్ళ నుండి తీరని కోరిక ఒకటి మదిలో మిగిలిపోయింది. ఆ కోరికను తాజాగా నెరవేర్చుకుంది. ఎన్నాళ్ళ నుండో మెగా ఫోన్ పట్టాలనుకుంటున్న రమ్య శ్రీ టైం కలిసిరాక ఆ పనిచేయలేదు. కానీ తాజాగా ఈ అమ్మడు మెగా ఫోన్ పట్టి, ఆమె అందులో కీలక పాత్ర పోషిస్తూ ‘ఓ మల్లి ’ పేరుతో  ఓ సినిమాని తెరకెక్కించింది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు రమ్యశ్రీ తెలిపింది. ఈ చిత్రంలో రమ్య హాట్ హాట్ గా కనిపిస్తుంది.

Kajal Have No Offers In Tollywood


Kajal Have No Offers In Tollywood

Kajal Have no offers in Tollywood.png

టాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరిగా వెలిగిపోతున్న కాజల్ కి ఏమీ లేవా ? అంటే చేతిలో ఒక్క సినిమా కూడా లేదా అంటే అవుననే అనిపిస్తుంది. బాలీవుడ్ హీరోలు ఈ అమ్మడు పై మోజు పడుతున్నా, తెలుగు లో మాత్రం ఈ అమ్మడు చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది ఎప్పుడో కాల్షీట్లు ఇచ్చేసిన ‘ఎవడు ’. ఆ సినిమా తరువాత తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. దీనికి కారణం అమ్మడు అత్యాశకు పోయి, భారీగా పారితోషికం పెంచేయడమే కారణం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. ఈ విషయం పై మీడియారు ప్రశ్నించగా అదేం కాదంటూ కాస్తంత ఘాటుగానే స్పందించింది. నేను ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. 

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ హీరో విజయ్ ప్రక్కన ‘జిల్లా ’ సినిమాలో, కార్తీతో ఓ సినిమాలో చేస్తుంది. వీటితోనే టైం సరిపోతుంది. ఇక కొత్త సినిమాలు చేసే టైం ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక కాజల్ పారితోషికం పెంచిన కారణంగా అవకాశాలు రావడం లేదనటం కరెక్టు కాదు అని చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు నాలుగు కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మూడు సినిమాలకే డేట్లు లేవనడం వెనుక రేటు భారీగా పెంచడం తోనే కాజల్ ని ప్రక్కన పెట్టేశారని అనుకుంటున్నారు సినీ జనాలు.

Junior NTR Tribul Role In New Movie

Junior NTR Tribul Role In New Movie

junior ntr  tribul role in new movie.png

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామయ్యా వస్తావయ్యా.. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనేది వార్త. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఇందులో ఇద్దరు ఎన్టీఆర్ లే కాకుండా మరో ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తాడట. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంటు పాత్రలో దర్శనమిస్తుండగా, ఇందులో సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడట. 

ఓన్లీ గ్రాఫిక్స్ తోనే సీనియర్ ఎన్టీఆర్ ని దించుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. గతంలో ఈయన డబుల్ రోల్ పోషించిన సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడోనని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Friday, 19 April 2013

One Lakh Hugs To All You Lovely People

Sending out one lakh hugs to all.png

లక్షమందికి కౌగిలింతలు ఇచ్చింది 
 
సినీ ముద్దుగుమ్మలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయగానే ఫాలోవర్లు కుప్పలు కుప్పులుగా వచ్చి చేరుతారు. అయితే వారు ఆమె పై ఉన్న అభిమానంతో చేరుతారా లేక టైంపాస్ కి చేరుతారా అన్న విషయం ప్రక్కన పెడితే... తాజాగా ‘ఆరెంజ్ ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన షాజన్ పదాంసీ ఈ మధ్యనే ట్విట్లర్లో ఖాతా తెరిచింది. ఖాతా తెరిచిన కొద్ది రోజులకే ఈమెకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరారరట. దీంతో ఈ అమ్మడు తెగ సంబరపడిపోయి ట్విట్లర్లో నన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య అప్పుడే అక్ష దాటేసింది. భలే థ్రిల్లింగ్ గా ఉంది. నా అభిమానులు ఒక్కొక్కరికీ ఒక్కో కౌగిలింత చొప్పున లక్ష కమ్మని కౌగిలింతలు ఇస్తున్నా  అంటూ ట్వీట్ చేసింది. ఈమె కౌగిలింతల్లో ఆ లక్షమంది తడిసిపోయారట. ఇలా కౌగిలింతలు ఇస్తే మరో లక్షమంది చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.