Ram Charan To Pair With Samantha And Catherine Tresa
రణ్ కొత్త సినిమా హీరోయిన్లు వీరే ?
రణ్ కొత్త సినిమా హీరోయిన్లు వీరే ?
తొలి
సినిమా తోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శక, రచయిత అయిన కొరటాల
శివ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో బండ్ల గణేష్ నిర్మాతగా ఓ
భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం
రామ్ చరణ్ సరసన సమంతా, కేథరీన్ త్రెసా కథానాయికలుగా ఈ ఇద్దరి
ముద్దుగుమ్మల్ని ఎంపిక చేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఒక వేళ వారు ఒప్పుకొని, కాల్షిట్లు గనుక ఇస్తే వీరిద్దరు చరణ్ తో ఆడి
పాడనున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ
ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. చరణ్ కెరియర్లోనే అత్యధిక
రెమ్యునరేషన్ తీసుకుంటూ నటించే ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని సినీ జనాలు
అంటున్నారు.
No comments:
Post a Comment