Friday, 14 December 2012

Hrithik Roshan Sexiest Man In Asia

hri
      
              బాలీవుడ్ రొమాంటిక్, అండ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ అంటే అభిమానించే వారు ఎందరో. కేవలం హిందీవాళ్లే కాదు ఇతగాడికి విశ్వవాప్యంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అమ్మాయిలైతే, చెవికోసుకుంటారు. ఇంత పాపులారిటీ సంపాదించుకున్న హృతిక్ ఈ ఏడాది సెక్సీయెస్ట్ ఆసియన్ గా ఎంపికయ్యాడు. లండన్ వీక్లీ మేగజైన్ 'ఈష్టర్న్ ఐ' ప్రతి ఏడాది నిర్వహించే ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం రుజువైంది.
          అయితే, గత ఏడాది కూడా హృతిక్ రోషనే ఈ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మిగతా నటుల స్థాన పరంపర ఇలా ఉంది..
         సెక్సీయెస్ట్ ఆసియన్ గా హృతిక్ మొదటి స్థానం సంపాదించుకోగా,..
2 వ స్థానంలో పాకీస్తానీ గాయకుడు ... నటుడు అలీజాఫర్,
3 వ స్థానంలో సల్మాన్ ఖాన్
4 వ స్థానంలో షాహీద్ కపూర్
5 వ స్థానంలో సిద్ధార్థ్ మల్హోత్రా
6 వ స్థానంలో కుశాల్ టాండన్
7 వ స్థానంలో షారూఖ్ ఖాన్
8 వ స్థానంలో జాన్ అబ్రహం
9 వ స్థానంలో రణబీర్ కపూర్ నిలిచారు. 
...avnk

Thursday, 13 December 2012

Venkatesh Birthday Special Story

VenkateshBirthdayPoster_13Dec2012
        
          విక్టరీ వెంకటేష్-మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో ఒకరోజు ఆలస్యంగా అంటే, డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తి చేసి సంక్రాంతి వరకు సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. వెంకటేష్, మహేష్ లకు జోడీగా అంజలి, సమంత నటిస్తున్నారు.
        ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకి అన్నయ్యగా నటిస్తోన్న విక్టరీ వెంకీ పుట్టిన రోజు ఇవాళ. బర్త్డేని పురస్కరించుకుని మహేష్ బాబుతో సహా ఈ చిత్ర యూనిట్ సభ్యులు, వెంకీ చేస్తోన్న మరో సినిమా ‘షాడో’ యూనిట్ సభ్యులు ఈ ఉదయం నుంచీ వెంకటేష్ ను గ్రీటింగ్స్ తో ముంచెత్తుతున్నారు. వెంకీ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలకూ చెందిన గ్రీటింగ్స్ పోస్టర్స్ విడుదల చేశారు.

VenkateshBirthdayPoster1_13Dec2012
       వెంకీ 53వ ఏట అడుగిడుతోన్న ఈ శుభతరుణంలో వెంకీ సినీ ప్రస్థాన్ని ఓ మారు మననం చేసుకుందాం..   కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేసిన వెంకీ తొలి సినిమా కలియుగపాండవులు హిట్ ఇవ్వడమే కాదు డెబ్యూ హీరోగా తొలి నంది అందించింది. తర్వాత వచ్చిన బ్రహ్మరుద్రులు, ‘చంటి’, ‘చినరాయుడు’, ‘గణేష్’, 'సూర్య ఐ పి యస్”, ‘సుందరాకాండ’, ‘బొబ్బిలి రాజా’.. ఇలా ప్రతీదీ విభిన్నమైన సినిమానే. అంతేకాదు.. అగ్ర హీరోల్లో రిమేక్ కధా చిత్రాలు ఎక్కువగా చేసింది వెంకటేష్ మాత్రమే. ‘చంటి’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘వసంతం’, ‘బాడీ గార్డ్’, ‘ఈనాడు’, ‘నాగవల్లి’… ఇలా చెప్పుకుంటూ పొతే… ఎన్నో సినిమాలు కనిపిస్తాయి.

new-svsce
        
     రీమేక్ కధల్లో ఓ సౌలభ్యం వుంది. రిస్క్ తక్కువ. హిట్ సినిమాలోని మంచి విషయాలు తీసుకుని, వాటికి మరిన్ని మెరుగులు పెట్టి… మరింత మంచి సినిమాగా తీర్చి దిద్దవచ్చు అని వెంకీ చెబుతుంటాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్టయిన ‘బోల్ బచ్చన్’ సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకీతో పాటు యంగ్ హీరో రామ్ నటిస్తున్నాడు. గత సంక్రాంతికి బాడీగార్డ్ గా వచ్చిన వెంకటేష్.. రాబోతున్న సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దొడుగా రాబోతున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ స్టోరీలో నటిస్తూ.. మరోవైపు మాఫియా నేపథ్యంతో 'షాడో' చిత్రం చేస్తున్నాడు. చాలా పాజిటివ్ గా ఎప్పుడూ ఆలోచించే వెంకీకి తెలుగువిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది..హ్యాపీ బర్త్డే వెంకీ...
...avnk

Wednesday, 12 December 2012

Jaya Bachchan Vs Aishwarya Bachchan

Aish_Jaya

ప్రముఖ సినీ నటుడు అయిన అభితాబ్ బచ్చన్ కుటుంబంలో బంధాలు బీటలు వారాయా ? బచ్చన్ కుటుంబంలో రాజకీయ చిచ్చు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ సినీ వర్గాలు. ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్, జయా బచ్చన్ లు అత్తా కోడళ్ళు అనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య తాజాగా రాజకీయ చిచ్చు మొదలైందని అంటున్నారు. నిన్నగాక మొన్న ఐశ్వర్యరాయ్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ పై ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాఖ్యలు సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలు, ఐశ్వర్య అత్త అయిన జయాబచ్చన్ కి ఎక్కడిలేని కోపాన్ని తెప్పించాయట. సమాజ్ వాదీ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్న జయా బచ్చన్ కి ఇలా ఎన్నికల ప్రచార సమయంలో మోడీ కి సపోర్టుగా మాట్లాడటం మింగుడుపడం లేదట. దీంతో బచ్చన్ ఫ్యామిలీ ఐశ్వర్యను కాస్త మందరలించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కోడలు పిల్ల పై జయా బచ్చన్ పొద్దుపోతే ఏం లాభం.... ఐశ్వర్య రాయ్ మామ అమితాబ్ బచ్చన్ గుజరాత్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి అలాంటప్పుడు జయాబచ్చన్ కోడలు పిల్లపై రుసరుస లాడటం ఏ బాగోలేదని అంటున్నారు ఐష్ అభిమానులు. మరి ఈ అత్తా కోడళ్ళ మధ్య అంటుకున్న రాజకీయ చిచ్చు ఎంత దూరం వెలుతుందోనని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

Tuesday, 11 December 2012

Rajani Kanth Birthday Celebrations



rajanie
       
ఈ పునర్జన్మ మీరు పెట్టిన భిక్షే.. ఆజన్మాంతం అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటా అని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రజనీ కాంత్ 62వ జన్మదినోత్సవం సందర్భంగా చెన్నైలోని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు. 14 ఏళ్లతర్వాత తమ అభిమాన నటుడు జన్మదిన వేడుక జరుపుకోవటంతో అభిమానులకు కొండంత సంబరమేసింది.
         ఈ సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు అభివాదం చేసి మాట్లాడుతూ.. త్వరలో విడుదల కానున్న 'కొచ్చడియాన్' చిత్రం అభిమానులకు కొత్త అనుభూతి ఇస్తుందని అన్నారు. శివాజీ-3డి చిత్రం కోసం ఆసక్తిగా ఉన్నానని తెలిపారు. అభిమానుల ప్రేమాభిమానాలే మళ్లీ బతికేలా చేశాయని అన్నారు. తుదిస్వాస విడిచేవరకూ మిమ్మల్ని రంజింప చేస్తూ, నేను చేయగలిగన సేవ చేస్తూనే ఉంటానని వెల్లడించారు.
rajanie
       రజనీ జీవిత ప్రస్థానం :  రజనీ కాంత్ 1950 డిసెంబర్ 12న బెంగుళూరులో శివాజీ రావు గైక్వాడ్ గా జన్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరకముందు లేబర్ గా, బస్ కండక్టర్ గా కూడా పనిచేసారు. అతనిలోని స్టైల్ ని క్యాచ్ చేసిన కె. బాలచందర్ తను 1975లో తీసిన ‘అపూర్వ రాగన్గల్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 1980ల్లో టాప్ తమిళ్ స్టార్ గా ఎదిగారు, 1990 లో ఎన్నో కమర్షియల్ హిట్స్ అందించారు.  ‘దళపతి’, ‘భాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘అంతులేని కథ’, ‘నరసింహా’, ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘రోబో’ మొదలైన సినిమాలు ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు. రజినీకాంత్ కు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషస్తులే కాదు, జపాన్, సింగపూర్ లో కూడా ఫాన్స్ ఉన్నారు. ఎంతో స్టార్ డం ఉన్నప్పటికీ రజనీకాంత్ చాలా సింపుల్ గా లైఫ్ డీల్ చేస్తారు.
     ఇదిలా ఉండగా, తమిళనాడులో రజనీ జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దాదాపు ప్రతీ నగరం, గ్రామాన రజనీ అభిమానులు కేక్స్ కట్ చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ బర్త్డే కటౌట్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంచుతున్నారు. మరోవైపు రజనీ కాంత్ కు దేశ విదేశాల సినీ ప్రముఖులు, రాజకీయ నేతల నుంచి.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల నుంచీ జన్మదిన శుభాకాంక్షలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి.

     ఇదిలా ఉండగా, తమిళనాడులో రజనీ జన్మదినోత్సవ వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దాదాపు ప్రతీ నగరం, గ్రామాన రజనీ అభిమానులు కేక్స్ కట్ చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ బర్త్డే కటౌట్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు పంచుతున్నారు.
...avnk

 

Gurajada Apparao Kanyasulkam

gura_2
        కళల ఖజానా విజయవాడలో కన్యాశుల్కం నాటకానికి మరోసారి ప్రేక్షకాభిషేకం జరిగింది. తెలుగు నాటకానికి ఎక్కడా ఆదరణ తగ్గలేదని నిరూపితమైంది. ఎప్పుడో 1892లో మహాకవి గురజాడ అప్పారావు రచించిన ఈ నాటకాన్ని ఈ నాటికీ తిలకిస్తూ తెలుగు కళాభిమానులు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వందేళ్ల తరువాత రాష్ట్రంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ముందే ఊహించి, తన రచనలో పొందుపర్చి, కవికి ఉండాల్సిన ముఖ్య లక్షణాన్ని ముందు తరాలకు అందించిన మహాకవి రచనకు విజయవాడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
kanyasulkam1
        ఆనాడు సమాజంలో పాతుకుపోయిన బాల్య వివాహాలు, మూఢ విశ్వాసాలు, వ్యక్తుల కుయుక్తులు, లంచావతారాలు... వంటి అంశాలపై వాడి వేడి వ్యంగ్యాన్ని రచించడంతో పాటు వితంతువులకు పునర్వివాహాలను సమర్ధిస్తూ సాగిన ఈ కన్యాశుల్కం నాటకంలోని ప్రతి పాత్రతో ఈ సమాజం కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు మన గురజాడ. మహాకవి గురజాడ అప్పారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో నిరంతరాయంగా ఎనిమిది గంటల పాటు విజయనగరానికి చెందిన నవయుగ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆహూతులను అలరించింది.

gurajada_in

         ఈ నాటకంలో ప్రధానంగా మధువాణి పాత్ర కీలకమైంది. ఈ పాత్రలో కాకినాడకు చెందిన కళాకారిణి మణిబాల తన శక్తి వంచన లేకుండా నటించారు. మానవత్వానికి కుల, మతాలు ప్రా మాణికం కాదని, నిమ్న కులంలో పుట్టినా మానవత్వం ఉంటుందనే సందేశాన్ని ఈ పాత్ర ద్వారా గురజాడ వెల్లడించారు. మరో కీలక పాత్ర గిరీశంగా ఉదయభాస్కర్ పాత్రోచితంగా హావభావాలు ప్రదర్శించారు. రావప్ప పంతులుగా డాక్టర్ ఆర్.సత్యనారాయణ తన పాత్రకు న్యాయం చేశారు. అగ్నిహోత్రావధానులుగా నటించిన జి.వి.ఎన్.కృష్టమోహన్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. లబ్ధావధానులుగా జొన్నలగడ్డ సీతారామశాస్త్రి నటనకు ఆహూతుల నుంచి ప్రశంసలు లభించాయి. వెంకమ్మగా సురభి విద్యావతి, బుచ్చమ్మగా వెంక ట పద్మావతి, కరకటక శాస్త్రిగా తేలిచర్ల అనిల్, వెంకటేశంగా కృష్ణచైతన్యల నటనకు విచ్చేసిన వారంతా అభినందనలు తెలిపారు. మహేశంగా ఆదిత్య మాస్టార్, పూటకూళ్ళమ్మగా బత్తుల లక్ష్మి నటన అందరిచే శభాష్ అనిపించుకుంది.        ఎప్పుడో 1892లో ఈ నాటకాన్ని గురజాడ అప్పారావు రచించగా అదే ఏడాది ఆగస్టు 13న విజయనగరంలో పూర్తి నిడివిలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు. 1897లో ఈ నాటకానికి అక్షర రూపాన్నిచ్చారు. 1909లో గురజాడే రెండోసారి ఈ నాటకంలో కొన్ని మార్పులు చేశారు. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది ఈ నవీన ముద్రణే. తొలి నాళ్లలో పూర్తి నిడివిగా ప్రదర్శితమైన ఈ నాటకాన్ని తిరిగి 2011లో విశాఖపట్నంలో ప్రదర్శించారు. అది చూసిన నగరానికి చెందిన కొందరు ప్రముఖులు విజయవాడలో కూడా ఏర్పాటు చేయాలని భావించి ఈ ప్రదర్శన ఏర్పాటు చేసి విజయవంతమయ్యారు. ఇలా ఎనిమిది గంటల పాటు ఈ నాటకాన్ని ప్రదర్శించడం గురజాడకు అర్పించే నిజమైన నివాళి అని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
...avnk

Actress Divya Prathibha Missing.

 

5
      
తల్లిదండ్రులతో సహా  సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ వర్ధమాన నటి అదృశ్యమైంది. ఈ ఘటన హైదరాబాద్ దిల్ షుక్ నగర్ చైతన్యపురి లో చోటు చేసుకుంది.
         వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లా గాంధీనగర్‌కు చెందిన అంబటి కుమార్, కుమార్తె దివ్య ప్రతిభ(22) పలు సినిమాల్లో నటించింది. శివ డెరైక్షన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి ఈనెల 6న ఆమె నగరానికి చేరుకుంది. వీరంతా దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక లాడ్జీలో దిగారు. సోమవారం ఉదయం సినిమా షూటింగ్ ముహూర్తం ఖరారైంది.
       అయితే, ఆదివారం రాత్రి 8.30గంటలకు బయటకు వెళ్ళిన దివ్యప్రతిభ తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె తండ్రి కుమార్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.
      చిత్రమేమిటంటే.. నూతన చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సిన డెరైక్టర్ శివ కూడా కనిపించకపోవడం.  ఇద్దరి సెల్ ఫోన్లూ స్విచ్ ఆఫ్ అయి ఉండటంతో ఇరువురూ కలిసి జంపైపోయ్ ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
...avnk

 

Mega Chiranjeevitham Book Launch

chie

       
తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గానూ.. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకుసాగి  ప్రస్తుతం కేంద్రమంత్రి హోదాలోనూ... ఉన్న చిరు జీవితం మీద సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు సంకలనం చేసిన 'మెగా చిరంజీవితం-సినీ ప్రస్థానం' పుస్తకం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ బుక్ విడుదలైన నాటినుంచే ఈ పుస్తకానికి మార్కెట్లో యమ క్రేజ్ ఏర్పడింది. ప్రచురణలు హాట్ కేకుల్లా అమ్ముడౌతున్నట్టు తెలుస్తోంది.
       ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖులు ‘చిరు’ ఔన్నత్యాన్ని కళ్లకు కట్టిన విధానం ఓ మారు మననం చేసుకుందాం..  ‘ఒక వ్యక్తి వృద్ధిలోకి రావడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి తన వెనుక ఎవరో ఒకరి సపోర్ట్‌, ఏదో ఒక సంస్థ కారణమై ఉంటుంది. కానీ చిరంజీవి ఎటువంటి సపోర్ట్‌ లేకుండా తన స్వయంకృషితో చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌ అయ్యాడు’ అని పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. పుస్తకావిష్కరణ గావించిన అక్కినేని  తొలి ప్రతిని రామ్‌చరణ్‌కు అందజేశారు.
        అనంతరం అక్కినేని ఇంకా ఏమన్నారంటే.. ‘పాతదనాన్ని అతి త్వరగా మర్చిపోయే రోజులివి. ఈ నేపథ్యంలో ప్రముఖుల చరిత్ర తెలుసుకోవడానికి ఇటువంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గురించి తెలియనివారంటూ లేరు. కానీ రాబోయే తరానికి ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి.’అన్నారు.
chiru_book_in1
        చిరు తనయుడు రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, ‘మా నాన్నగారి బ్రయోగ్రఫీ రాయమని చాలాసార్లు ఆయన్ను అడిగాను. కానీ నాన్నగారు అంత ఇంట్రెస్ట్‌ చూపించలేదు. తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చి మేం రాస్తాం అని నాన్నగారిని అడిగారు. అయినా ఆయన అంగీకరించలేదు. మా కుటుంబం గురించి బాగా తెలిసిన వ్యక్తి రామారావు ఈ పుస్తకం సంకలనం చేయడం ఆనందంగా ఉంది. రెండు, మూడు పేజీల్లో నాకు తెలియని చాలా విషయాలు ఆయన పొందుపర్చారు. ఈపుస్తకం సెకండ్ పార్ట్‌ ను కూడా ఆయనే తయారు చేయాలని కోరుతున్నాను. అందుకు నావంతు సహకారం చేస్తాను’ అన్నారు.
       అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. రామారావు సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని చాలా గ్రాండ్‌గా డిజైన్‌ చేద్దాం అనుకున్నాం. అందుకు ఆయన అంగీకరించలేదు. తన స్వయంకృషితో సంపాదించిన డబ్బుతో మాత్రమే పుస్తకాన్ని రూపుదిద్దారు అన్నారు.
        రామారావు మాట్లాడుతూ.. ‘గతంలో ప్రకాశం, ఒంగోలు ప్రాంతాల్లో ఏర్పడిన కరువు వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్ళగా, ఆయన స్పందించి నేనిచ్చిన బాధితుల లిస్ట్‌ ప్రకారం 'యముడికి మొగుడు' చిత్రం 100రోజుల ఫంక్షన్‌లో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ రోజు నుంచి చిరంజీవి అంటే అభిమానం. అలా మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. చిరంజీవిని మొదటగా ఇంటర్వ్వూచేసే అవకాశం నాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తక రచనకు సహకరించిన నిర్మాత సురేష్ కొండేటికి క్రుతజ్ణతలు తెలుపుకుంటున్నా’ అని వ్యక్తీకరించారు.
...avnk