Thursday, 13 December 2012

Venkatesh Birthday Special Story

VenkateshBirthdayPoster_13Dec2012
        
          విక్టరీ వెంకటేష్-మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఆడియో ఒకరోజు ఆలస్యంగా అంటే, డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా వేగంగా పూర్తి చేసి సంక్రాంతి వరకు సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. వెంకటేష్, మహేష్ లకు జోడీగా అంజలి, సమంత నటిస్తున్నారు.
        ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుకి అన్నయ్యగా నటిస్తోన్న విక్టరీ వెంకీ పుట్టిన రోజు ఇవాళ. బర్త్డేని పురస్కరించుకుని మహేష్ బాబుతో సహా ఈ చిత్ర యూనిట్ సభ్యులు, వెంకీ చేస్తోన్న మరో సినిమా ‘షాడో’ యూనిట్ సభ్యులు ఈ ఉదయం నుంచీ వెంకటేష్ ను గ్రీటింగ్స్ తో ముంచెత్తుతున్నారు. వెంకీ పుట్టిన రోజు సందర్భంగా రెండు సినిమాలకూ చెందిన గ్రీటింగ్స్ పోస్టర్స్ విడుదల చేశారు.

VenkateshBirthdayPoster1_13Dec2012
       వెంకీ 53వ ఏట అడుగిడుతోన్న ఈ శుభతరుణంలో వెంకీ సినీ ప్రస్థాన్ని ఓ మారు మననం చేసుకుందాం..   కలియుగ పాండవులు సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేసిన వెంకీ తొలి సినిమా కలియుగపాండవులు హిట్ ఇవ్వడమే కాదు డెబ్యూ హీరోగా తొలి నంది అందించింది. తర్వాత వచ్చిన బ్రహ్మరుద్రులు, ‘చంటి’, ‘చినరాయుడు’, ‘గణేష్’, 'సూర్య ఐ పి యస్”, ‘సుందరాకాండ’, ‘బొబ్బిలి రాజా’.. ఇలా ప్రతీదీ విభిన్నమైన సినిమానే. అంతేకాదు.. అగ్ర హీరోల్లో రిమేక్ కధా చిత్రాలు ఎక్కువగా చేసింది వెంకటేష్ మాత్రమే. ‘చంటి’, ‘సూర్యవంశం’, ‘రాజా’, ‘వసంతం’, ‘బాడీ గార్డ్’, ‘ఈనాడు’, ‘నాగవల్లి’… ఇలా చెప్పుకుంటూ పొతే… ఎన్నో సినిమాలు కనిపిస్తాయి.

new-svsce
        
     రీమేక్ కధల్లో ఓ సౌలభ్యం వుంది. రిస్క్ తక్కువ. హిట్ సినిమాలోని మంచి విషయాలు తీసుకుని, వాటికి మరిన్ని మెరుగులు పెట్టి… మరింత మంచి సినిమాగా తీర్చి దిద్దవచ్చు అని వెంకీ చెబుతుంటాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్టయిన ‘బోల్ బచ్చన్’ సినిమాని రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకీతో పాటు యంగ్ హీరో రామ్ నటిస్తున్నాడు. గత సంక్రాంతికి బాడీగార్డ్ గా వచ్చిన వెంకటేష్.. రాబోతున్న సంక్రాంతికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో పెద్దొడుగా రాబోతున్నాడు. ఒకవైపు ఫ్యామిలీ స్టోరీలో నటిస్తూ.. మరోవైపు మాఫియా నేపథ్యంతో 'షాడో' చిత్రం చేస్తున్నాడు. చాలా పాజిటివ్ గా ఎప్పుడూ ఆలోచించే వెంకీకి తెలుగువిశేష్.కాం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది..హ్యాపీ బర్త్డే వెంకీ...
...avnk

No comments:

Post a Comment