Showing posts with label ram charan. Show all posts
Showing posts with label ram charan. Show all posts

Friday, 13 November 2015

Mega Star Ram Charan Meets Facebook Employees


ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దాదాపు 90% మంది జనాలు ఫేస్ బుక్ లో తెగ సందడి చేసేస్తుంటారు. కానీ మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఏకంగా ఫేస్ బుక్ ఆఫీస్ లోనే సందడి చేసేసాడు. తన భార్య ఉపాసనతో కలిసి అమెరికాలో వెకేషన్స్ కు వెళ్లాడు. శుక్రవారం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫేస్ బుక్ హెడ్ ఆఫీస్ లో సందడి చేసారు.

అక్కడి ఉద్యోగులతో చరణ్ కాసేపు సరదాగా గడిపి, ముచ్చటించారు. వారితో కలిసి చరణ్ కొన్ని ఫోటోలను తీసుకున్నారు. ఆ ఫోటోలను చరణ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. తనకు కానుకలు ఇచ్చిన వారికి చరణ్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. వారు కూడా చరణ్ తో సెల్ఫీలు తీసుకున్నారు.

‘బ్రూస్ లీ’ తర్వాత చరణ్ ‘థని ఒరువన్’ రీమేక్ లో నటించనున్నాడు. ఈ రీమేక్ కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Source: http://www.teluguwishesh.com/cinema-movies-films/191-cinema-film-movie-headlines-news/70151-ram-charan-meets-facebook-employees.html

Thursday, 15 October 2015

Bruce Lee Movie Review


శ్రీనువైట్ల దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘బ్రూస్ లీ - ది ఫైటర్’. డివివి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. కృతి కర్బందా, నదియా, అరుణ్ విజయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఫ్యామిలీ, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

Here is the Ram Charan Bruce Lee Movie Review

Thursday, 29 August 2013

Ram Charan's real enemies multiply



Ram Charan's real enemies multiply
Ram Charan may have taught a lesson to his reel villains. But, what about the real enemies who are out to get him? Charan is in fresh trouble over the previously infamous drunken traffic brawl in Banjara Hills.
It may be noted that a few weeks back, Charan's security guards were sent to manhandle two software employees on a busy street in Banjara Hills as they passed indecent comments. Charan and his wife were on their way to a nearby hotel for a family meal. As per police reports, it was the actor who had actually provoked them, leading to the fight.
The techies did not file a case for fear of the political clout of dad Chiranjeevi. Unfortunately for the actor, the case has come back to haunt him again with the State Human Rights Commission directing the Banjara Hills Police to book cases against him and the security men.
Compounding his troubles, even Priyanka Chopra is miffed with Charan for not being punctual to the promotional activities of Zanjeer. The 'Exotic' singer is reportedly furious over his carelessness. Enough troubles? There's more. Seemandhra protestors in Vizianagaram have burnt one of the posters of Toofan, saying that they will stop the film from screening.
Despite police action, the agitators are vocal about their displeasure with Chiranjeevi. Charan had recently gained appreciation for having the presence of mind to save a Zanjeer cast member from being hit by his bike during a fight scene, when the fighter slipped and fell. After the bouquets, the brickbats have followed with equal measure. Let's hope he handles this better.
(AW: Sruthi)

Monday, 21 January 2013

Ram Charan Success Tour


1.2
   
     వేలాది మంది అభిమానులను చూసుకుని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  రెచ్చిపోయాడు.  లయబద్ధంగా డ్యాన్స్ చేసి, అభిమానుల కరతాళ ధ్వనులు అందుకున్నాడు. ఈ అద్భుత సందర్భాలు 'నాయక్' సినిమా విజయోత్సవ యాత్రలో ఆద్యంతం కనిపించాయి. ఒక్కరోజులోనే రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాలలో నాయక్ టీం సుడిగాలిలా పర్యటించి సందడి చేసింది. మా సందర్శకులకు ఇంతకుముందు వెల్లడించినట్టుగానే   ముందుగా విశాఖలో ఈ యాత్ర ప్రారంభమైంది. అక్కడి ఐనాక్స్ ధియేటర్ వద్దకి తరలి వచ్చిన వేలాది మంది అభిమానుల ఉత్సాహం చూసి, పులకించిపోయిన రామ్ చరణ్... తను ప్రయాణిస్తున్న వ్యాన్ నుంచి బయటకు వచ్చి... ఒక్కసారిగా టాప్ ఎక్కి ... నాయక్ సినిమాలోని పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేసేశాడు. ఇదే సీన్ విజయవాడ, తిరుపతిలలో కూడా రిపీట్ అయింది. అన్ని ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతేకాదు తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు కేరింతలు,  హర్షధ్వానాలతో స్వాగతం పలకటమే కాదు. చిందులువేశారు.

13
           ఇదిలా ఉండగా, 'నాయక్' సినిమా మీద గండి బాబ్జీ లేవనెత్తిన వివాదం పట్ల ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. జరిగిన సంఘటన కాకతాళియమే కానీ, దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలోని విలన్ కి  కావాలనే తన పేరు పెట్టారంటూ విశాఖ జిల్లా మాజీ ఎం.ఎల్.ఎ. గండి బాబ్జీ గొడవకి దిగడం విచారకరమన్నారు. ఇది కేవలం కాకతాళీయంగా  జరిగిందేనని దీనికి బాబ్జీ చింతిస్తే క్షమించాలని మీడియా ముఖంగా క్షమాపణలు తెలియజేశాడు.
14
       కాగా, నాయక్ మూవీ విడుదలై పది రోజులు దాటినా నాయక్ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గటంలేదు. అయితే ఈ కలెక్షన్ల వివరాల పట్ల నిర్మాత దానయ్య ఏమాత్రం నోరు మెదపటంలేదు. కారణం ఆయన ఇంటిపై ఇటీవల జరిగిన ఐటీ దాడులే కారణమని తెలుస్తోంది. నాయక్ విజయయాత్ర చిత్రాలు మీకోసం..
....avnk

Friday, 18 January 2013

Nagababu Daughter Niharika As Heroine

Niharika

       ఇఫ్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చాలా మంది హీరో హీరోయిన్ల పిల్లలు తెరంగ్రేటం చేసి రాణిస్తున్నారు. కానీ మెగా హీరో ఫ్యామిలీ నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చారు కానీ, హీరోయిన్లు ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా తెరంగ్రేటం చేయబోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆలోచనకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఈమె నిర్మాతగా అవతారం ఎత్తబోతుందని వార్తలు వచ్చాయి కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే... అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాలో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు అఖిల్ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమా గానీ, దానికి సంబంధించిన ప్రకటన గానీ వెలువడలేదు. ఒకవేళ వీరిద్దరు జంటగా తెరంగ్రేటం చేస్తే మాత్రం అభిమానుల్లో వీరి సినిమా పై ఆస్తకి నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది.

Saturday, 12 January 2013

Nayak Movie Unit Press Meet


Nayak Movie Unit Press Meet

   సాధారణంగా నా సినిమాలెక్కువగా మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతాయి. కానీ ఈ సినిమా ఓ వింత అనుభూతి నిచ్చింది. అదేంటంటే - ఇది ఫ్యామిలీస్‌కు కూడా బాగా నచ్చుతోంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా జయప్రకాశ్‌రెడ్డి కేరక్టర్‌ని బాగా ఇష్టపడుతున్నారు. బ్రహ్మానందం డాన్స్ బిట్టయితే వాళ్లకి పిచ్చిపిచ్చిగా నచ్చింది. ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్ అయితే ఆడవాళ్లకి చాలా బాగా నచ్చింది. అందరికీ ఏకపక్షంగా నచ్చింది పోసాని కృష్ణమురళి కేరక్టర్. జనం ఆయన పాత్రని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ తప్ప మిగతా సినిమా అంతా నవ్వుతూ ఎంజాయ్ చేశామనీ ఫ్యామిలీ ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయ్ అంటున్నారు. రాంచరణ్ రెండు పాత్రలూ బాగా చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. సినిమాలో తన బావ చనిపోయినప్పుడు అతని పర్ఫార్మెన్స్ నాకు కన్నీళ్లు తెప్పించింది అని చెప్పారు వి.వి. వినాయక్. రాంచరణ్ ద్విపాత్రాభినయం చేయగా రూపొందిన 'నాయక్' చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేశారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించగా, యస్. రాధాకృష్ణ సమర్పించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. వినాయక్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...  ఈ సినిమాతో నేనేమనుకున్నానో వంద శాతం దాన్ని సాధించాను. నేనూహించిన దానికి మించి ఆడవాళ్లకు కూడా బాగా నచ్చుతోంది. ఇండస్ట్రీలోని టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలుస్తుందని గట్టిగా చెప్పగలను. ట్రెమండస్ ఓపెనింగ్స్. మొదటి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
Nayak Movie Unit Press Meet

   అత్యధిక థియేటర్‌లలో సినిమాని వేశారు. అందరికీ నచ్చింది. సంక్రాంతి చాలా ముందుగానే వచ్చేసిందంటున్నారు. చిరంజీవి గారికి చాలా నచ్చింది. 'చాలా బాగా తీశావ్ వినయ్. అన్నీ కుదిరాయ్. చాలా అద్భుతంగా ఉంది' అన్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందినవారు చాలామంది 'సూపర్‌గా ఉంది' అన్నారు.  అంతేకాకుండా కథలో నాకు ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా నచ్చింది. రెండు పాత్రలూ రూపంలో ఒకే విధంగా ఉన్నా, క్యారెక్టరైజేషన్ పరంగా వాటిలోని వేరియేషన్‌ను రాంచరణ్ చాలా బాగా ప్రదర్శించాడు. కోర్టు బయటి సీన్‌లో క్లోజప్స్‌లో అతను ఎంత బాగా చేశాడంటే, తన కోసం జనం వస్తే, ఆ జనం మీద తనకున్న కృతజ్ఞతను తన కళ్లల్లో ఎంత బాగా అంటే అంత బాగా చూపించాడు. అదివరకు 'ఠాగూర్'ను చిరంజీవి గారితో చేసేప్పుడు చాలా టెన్షన్ పడేవాణ్ణి. ఇప్పుడు చరణ్‌ను చిరంజీవి గారిలాగే చూపించాలనుకున్నా. అందుకు తగ్గట్లే 'చరణ్ చాలా షాట్స్‌లో చిరంజీవిలాగే ఉన్నాడు' అని చాలామంది అంటున్నారు.

Tuesday, 18 December 2012

Mega Power Ram Charans Nayak Audio Release

mega power ram charans nayak audio release

    మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ తేజ్,  హీరోయిన్ కాజల్ , అమలాపాల్ , వినాయక్ దర్వకత్వంలో  నటించిన  సినిమా నాయక్.  నాయక్ ఆడియో ఫంక్షన్ వేడుక  అభిమానుల సందడితో ఘనంగా జరిగింది.  అయితే నాయక్ ఆడియో ఫంక్షన్ కు  కేంద్ర మంత్రి  మెగా స్టార్  చిరంజీవి  రాకపోవటంతో అభిమానులు  కొత్త నిరాశ చెందారు. అయితే  మెగా స్టార్  చిరంజీవి స్థానంలో .. ఆయన సతిమణి  రామ్ చరణ్ తల్లి సురేఖ రావటంతో .. నిరాశతో అభిమానులకు ఉపచమనం కలింగింది. నాయక్ ఆడియో ఫంక్షన్ పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  హాజరుకాడని కొన్ని మీడియా పత్రికలు  రాయటం జరిగింది.  అలాంటి మీడియా  పత్రికలకు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్  నోళ్లు మూయించారు.  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ రాకతో  మెగా అభిమానులు మరింత ఉత్సహంగా కనిపించారు. పవన్ రాకతో  ఒక్కసారిగా  ఫంక్షన్ హాలు మొత్తం  హర్షధ్వనులతో మారుమోగిపోయింది.  మెగా కుటుంబం నుండి  నాయక్ ఆడియో ఫంక్షన్ కు  రామ్ చరణ్ తేజ్ , రామ్ చరణ్  భార్య ఉపాసన , చిరంజీవి సతిమణి సురేఖ, అల్లు అరవింద్, స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,  రామ్ చరణ్  సోదరి, పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ హాజరవ్వటంతో.. మెగా అభిమానులకు ఆడియో వేదిక మీద మెగా కుటుంబాన్ని  చూసే అద్రుష్టం కలిగింది. 

mega power ram charans nayak audio release

   ఆడియో ఫంక్షన్ కు ఇద్దరు  అందాల భామలతో  వేదిక మరీ అందంగా తయారైంది. హీరోయిన్ కాజల్  పసుపు వర్ణం డ్రెస్ తో  మెగా అభిమానులకు కనువింద్ చేసింది. నాయక్ సినిమాలో  సెకండ్ హీరోయిన్ అయిన  అమలా పాల్.. ఎరుపు రంగు సెక్సీ డ్రెస్ లో  మెగా అభిమానులకు మతిపొగట్టింది. ఆడియో ఫంక్షన్ లో  రామ్ చరణ్  కొంచెం ఆవేశానికి గురైనట్లు తెలుస్తుంది.  రామ్ చరణ్  మాట్లాడుతూ  నాన్న ఈ వేడుకకి రాలేకపోయిన  ఆ లోటుని  కళ్యాణ్ బాబాయ్  తీర్చారని ఉద్రేకంగా చెప్పారు.  మెగా ప్యామిలీలో  నాన్న తరువాత నేను కాదు.  ఆ స్థానం  పవన్  బాబాయ్ దే. ఆయన్ని ఎవరైనా  ఏమైనా అంటే   నేను ఊరుకోను  అని రామ్ చరణ్ ఆవేశంతో  ఉక్రోశంగా  అన్నారు. ఇటీవల కాలంలో  రచ్చ పాటల వేడుకకు బాబాయ్  రాలేదని  రకరకాల  కథనాలు  వినిపించారు.   వేదికపై  అఅందరు ఉంటేనే  మా మధ్య ప్రేమ ఉన్నట్టు కాదు.  మా మద్య ఎలాంటి  అనుంబంధం ఉందో   మాకు తెలుసు.  మా నాన్నకి , బాబాయ్ కి  మధ్య ఎలాంటి  అనుబంధం  ఉందో, నాకు బాబాయ్ కి మద్య ఎలాంటి ప్రేమ ఉందో మాకే తెలుసు.  నేను  చేయబోయే  తరువాత  సినిమా పాటల వేడుకకు  కూడా మా కళ్యాణ్ బాబాయ్  రాకపోవచ్చు.  అంతమాత్రానికే  మా మధ్య  ప్రేమ లేదనుకోవద్దు. 

mega power ram charans nayak audio release

   ఇలాంటి  లేనిపోని కథనాలు  వస్తే నేను పట్టించుకోను .  ఇలాంటి  విషయాలను  గురించి, ఓ పత్రిక, ఓ ఛానల్ ఏం రాసినా  అది నాకు  వెంట్రుకతో  సమానం అని రామ్ చరణ్ అన్నారు.   అంతేకాకుండా 37 యేళ్లుగా  మా మద్య ఉన్న  అనుబంధాన్ని  ఏ  ఛానల్  కూడా వీడదీయలేదని  చరణ్ అన్నారు.   వినాయక్  ఒక దర్శకుడు కాదు , నాకు ఇంకో బాబాయ్ లాంటి వాడన్నారు.   అయితే చివరిగా  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ   సరైన పరిస్థితుల, అవసరం  ఉంటే తప్ప నాకు  మాట్లాడాలని అనిపించదు.  అందరూ సంతోషంగా  ఉండాలి. చిత్ర పరిశ్రమలోని అందరూ కూడా   మా కుంటుంబలోని వారే.  రామ్ చరణ్   డ్యాన్సుల్ని   నేను ఎంతగానో  ఆస్వాదిస్తాను  అని పవన్ మాట్లాడటం జరిగింది.  కేంద్ర మంత్రి చిరంజీవి మాత్రం  ఆన్ లైన్ లో మాట్లాడి  మెగా అభిమనులను  ఆనందం నింపారు.  నాయాక్  ఆడియో తో   మెగా బ్రదర్స్ మద్య విభేదాలు లేవని  మెగా అభిమానులకు కోసం రామ్ చరణ్  చెప్పటం జరిగిందని  అన్నారు. 

mega power  ram charans nayak audio release

Tuesday, 11 December 2012

Mega Chiranjeevitham Book Launch

chie

       
తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గానూ.. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకుసాగి  ప్రస్తుతం కేంద్రమంత్రి హోదాలోనూ... ఉన్న చిరు జీవితం మీద సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు సంకలనం చేసిన 'మెగా చిరంజీవితం-సినీ ప్రస్థానం' పుస్తకం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ బుక్ విడుదలైన నాటినుంచే ఈ పుస్తకానికి మార్కెట్లో యమ క్రేజ్ ఏర్పడింది. ప్రచురణలు హాట్ కేకుల్లా అమ్ముడౌతున్నట్టు తెలుస్తోంది.
       ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖులు ‘చిరు’ ఔన్నత్యాన్ని కళ్లకు కట్టిన విధానం ఓ మారు మననం చేసుకుందాం..  ‘ఒక వ్యక్తి వృద్ధిలోకి రావడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి తన వెనుక ఎవరో ఒకరి సపోర్ట్‌, ఏదో ఒక సంస్థ కారణమై ఉంటుంది. కానీ చిరంజీవి ఎటువంటి సపోర్ట్‌ లేకుండా తన స్వయంకృషితో చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌ అయ్యాడు’ అని పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. పుస్తకావిష్కరణ గావించిన అక్కినేని  తొలి ప్రతిని రామ్‌చరణ్‌కు అందజేశారు.
        అనంతరం అక్కినేని ఇంకా ఏమన్నారంటే.. ‘పాతదనాన్ని అతి త్వరగా మర్చిపోయే రోజులివి. ఈ నేపథ్యంలో ప్రముఖుల చరిత్ర తెలుసుకోవడానికి ఇటువంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గురించి తెలియనివారంటూ లేరు. కానీ రాబోయే తరానికి ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి.’అన్నారు.
chiru_book_in1
        చిరు తనయుడు రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, ‘మా నాన్నగారి బ్రయోగ్రఫీ రాయమని చాలాసార్లు ఆయన్ను అడిగాను. కానీ నాన్నగారు అంత ఇంట్రెస్ట్‌ చూపించలేదు. తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చి మేం రాస్తాం అని నాన్నగారిని అడిగారు. అయినా ఆయన అంగీకరించలేదు. మా కుటుంబం గురించి బాగా తెలిసిన వ్యక్తి రామారావు ఈ పుస్తకం సంకలనం చేయడం ఆనందంగా ఉంది. రెండు, మూడు పేజీల్లో నాకు తెలియని చాలా విషయాలు ఆయన పొందుపర్చారు. ఈపుస్తకం సెకండ్ పార్ట్‌ ను కూడా ఆయనే తయారు చేయాలని కోరుతున్నాను. అందుకు నావంతు సహకారం చేస్తాను’ అన్నారు.
       అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. రామారావు సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని చాలా గ్రాండ్‌గా డిజైన్‌ చేద్దాం అనుకున్నాం. అందుకు ఆయన అంగీకరించలేదు. తన స్వయంకృషితో సంపాదించిన డబ్బుతో మాత్రమే పుస్తకాన్ని రూపుదిద్దారు అన్నారు.
        రామారావు మాట్లాడుతూ.. ‘గతంలో ప్రకాశం, ఒంగోలు ప్రాంతాల్లో ఏర్పడిన కరువు వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్ళగా, ఆయన స్పందించి నేనిచ్చిన బాధితుల లిస్ట్‌ ప్రకారం 'యముడికి మొగుడు' చిత్రం 100రోజుల ఫంక్షన్‌లో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ రోజు నుంచి చిరంజీవి అంటే అభిమానం. అలా మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. చిరంజీవిని మొదటగా ఇంటర్వ్వూచేసే అవకాశం నాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తక రచనకు సహకరించిన నిర్మాత సురేష్ కొండేటికి క్రుతజ్ణతలు తెలుపుకుంటున్నా’ అని వ్యక్తీకరించారు.
...avnk