Tuesday, 11 December 2012

Mega Chiranjeevitham Book Launch

chie

       
తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గానూ.. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకుసాగి  ప్రస్తుతం కేంద్రమంత్రి హోదాలోనూ... ఉన్న చిరు జీవితం మీద సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు సంకలనం చేసిన 'మెగా చిరంజీవితం-సినీ ప్రస్థానం' పుస్తకం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆదివారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ బుక్ విడుదలైన నాటినుంచే ఈ పుస్తకానికి మార్కెట్లో యమ క్రేజ్ ఏర్పడింది. ప్రచురణలు హాట్ కేకుల్లా అమ్ముడౌతున్నట్టు తెలుస్తోంది.
       ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖులు ‘చిరు’ ఔన్నత్యాన్ని కళ్లకు కట్టిన విధానం ఓ మారు మననం చేసుకుందాం..  ‘ఒక వ్యక్తి వృద్ధిలోకి రావడానికి, ఉన్నత స్థాయికి ఎదగడానికి తన వెనుక ఎవరో ఒకరి సపోర్ట్‌, ఏదో ఒక సంస్థ కారణమై ఉంటుంది. కానీ చిరంజీవి ఎటువంటి సపోర్ట్‌ లేకుండా తన స్వయంకృషితో చిత్రపరిశ్రమలో మెగాస్టార్‌ అయ్యాడు’ అని పద్మవిభూషణ్‌ అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. పుస్తకావిష్కరణ గావించిన అక్కినేని  తొలి ప్రతిని రామ్‌చరణ్‌కు అందజేశారు.
        అనంతరం అక్కినేని ఇంకా ఏమన్నారంటే.. ‘పాతదనాన్ని అతి త్వరగా మర్చిపోయే రోజులివి. ఈ నేపథ్యంలో ప్రముఖుల చరిత్ర తెలుసుకోవడానికి ఇటువంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఉంది. చిరంజీవి గురించి తెలియనివారంటూ లేరు. కానీ రాబోయే తరానికి ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి.’అన్నారు.
chiru_book_in1
        చిరు తనయుడు రామ్‌చరణ్‌ మాట్లాడుతూ, ‘మా నాన్నగారి బ్రయోగ్రఫీ రాయమని చాలాసార్లు ఆయన్ను అడిగాను. కానీ నాన్నగారు అంత ఇంట్రెస్ట్‌ చూపించలేదు. తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చి మేం రాస్తాం అని నాన్నగారిని అడిగారు. అయినా ఆయన అంగీకరించలేదు. మా కుటుంబం గురించి బాగా తెలిసిన వ్యక్తి రామారావు ఈ పుస్తకం సంకలనం చేయడం ఆనందంగా ఉంది. రెండు, మూడు పేజీల్లో నాకు తెలియని చాలా విషయాలు ఆయన పొందుపర్చారు. ఈపుస్తకం సెకండ్ పార్ట్‌ ను కూడా ఆయనే తయారు చేయాలని కోరుతున్నాను. అందుకు నావంతు సహకారం చేస్తాను’ అన్నారు.
       అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. రామారావు సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని చాలా గ్రాండ్‌గా డిజైన్‌ చేద్దాం అనుకున్నాం. అందుకు ఆయన అంగీకరించలేదు. తన స్వయంకృషితో సంపాదించిన డబ్బుతో మాత్రమే పుస్తకాన్ని రూపుదిద్దారు అన్నారు.
        రామారావు మాట్లాడుతూ.. ‘గతంలో ప్రకాశం, ఒంగోలు ప్రాంతాల్లో ఏర్పడిన కరువు వల్ల చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్ళగా, ఆయన స్పందించి నేనిచ్చిన బాధితుల లిస్ట్‌ ప్రకారం 'యముడికి మొగుడు' చిత్రం 100రోజుల ఫంక్షన్‌లో ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ రోజు నుంచి చిరంజీవి అంటే అభిమానం. అలా మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది. చిరంజీవిని మొదటగా ఇంటర్వ్వూచేసే అవకాశం నాకే రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తక రచనకు సహకరించిన నిర్మాత సురేష్ కొండేటికి క్రుతజ్ణతలు తెలుపుకుంటున్నా’ అని వ్యక్తీకరించారు.
...avnk

No comments:

Post a Comment