Friday, 4 January 2013

Nayak Movie Theaters List

Nayak-Movie-Latest-Posters-1846
           
    మోగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, కాజల్‌ అగర్వాల్‌, అమలాపాల్‌ హీరోయిన్స్‌గా కమర్షియల్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌ నిర్మాతగా యూనివర్సల్‌ మీడియా బ్యానర్‌పై అత్యంత భారీగా రూపొందుతున్న చిత్రం 'నాయక్‌'. నిన్ననే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలుసు. ఇక కేవలం 4రోజులే విడుదల తేదీ కావటంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రవర్గం సన్నాహాల్లో మునిగిఉంది.  జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా 2000లకు పైగా థియేటర్స్‌ లో నాయక్‌ విడుదల కానుంది. కొద్దిసేపటిక్రితం ఈ చిత్రం ట్విన్ సిటీస్ లో ఏఏ థియేటర్లలో విడుదలవుతుందో వెల్లడించే జాబితాను విడుదల చేశారు. ఇక్కడ కనిపిస్తున్న థియేటర్స్ లిస్ట్ అదే.. మల్టీ స్టారర్ మూవీ సీవాసిచె కంటే భారీగా విడుదలవుతోన్న ఈ చిత్రం తీరు చూస్తుంటే రిలీజ్ రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టే యోచన కనిపిస్తుంది. 
 
           ఇదిలా ఉండగా ‘నాయక్’ మూవీ  ఓవర్సీస్ లో కూడా  రికార్డ్ స్థాయిలో విడుదల కానుంది.  యు ఎస్ లో కూడా రికార్డ్ స్థాయిలో విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్రాన్ని అక్కడ 100 స్క్రీన్స్ లో విడుదల చెయ్యాలన్న యోచనలో ఉన్నారు. ఒక తెలుగు చిత్రం ఈ స్థాయిలో విడుదల అవుతూ ఉండటం ఇదే మొదటి సారి. ఈ చిత్ర ప్రింట్లు రేపు ఇక్కడనుండి బయలుదేరుతాయి. జనవరి 8న అక్కడ ప్రేమియర్లు ప్రదర్శిస్తారు.

         కాగా, నిన్న సెన్సార్‌ సభ్యుల నుండి ఎక్సార్డనరీ రిపోర్టు రావటంతో నిర్మాత దానయ్య అతని టీం సభ్యులు మాంచి ఖుషీ మీదున్నారు. అంతేకాదు  సంక్రాంతికి ఈ చిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రం అని సెన్సారు సభ్యులు చెప్పటం ఆనందంగా వుందని. ఈ చిత్రం మెగా అభిమానులకి ఐదు రోజుల ముందే పండగ వాతావరణాన్ని కల్పిస్తుందని నిర్మాత అంటున్నారు.

nayak1        
         చరణ్ ఫెర్ఫామెన్స్,  వినాయక్‌ టేకింగ్‌, థమన్‌ సంగీతం, ఆకుల శివ, కథ, మాటలు. కాజల్‌, అమలాపాల్‌ల అందమైన అభినయాలు, పోసానికామెడీ ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయని సమాచారం. నాయక్ చిత్రాన్ని యూనివర్సల్‌ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్‌ రెడ్డి, రాహుల్‌ దేవ్‌, రఘుబాబు, ఎమ్మెస్‌ నారాయణ, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌, సుధ తదితరులు నటిస్తున్నారు.

కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.
         ఇక,  తాజాగా అందిన వివరాల ప్రకారం తొలి రోజు ఏయే ఏరియాల్లో ‘నాయక్' చిత్రం ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో థియేటర్ల సంఖ్య ప్లస్  ఏరియాల వారిగా  :
 నైజాం : 320+
సీడెడ్ : 140+
నెల్లూరు : 45+
గుంటూరు : 90+
కృష్ణా : 85+
వెస్ట్ గోదావరి : 85+
ఈస్ట్ గోదావరి : 95+
ఉత్తరాంధ్ర : 105+
కర్నాటక : 125+
తమిళనాడు : 45(చెన్నై-24, కోయంబత్తూర్-02, మధురై-01, తంజావూరు-01,తిరువల్లూరు-06, ఇతర ప్రాంతలు-10+)
రెస్టాఫ్ ఇండియా : 40 ఇండియా వ్యాప్తంగా టోటల్ థియేటర్ల సంఖ్య దాదాపు గా 1200    
         
          ఇదే కాకుండా ఈ సారి యూఎస్‌తో పాటు ఓవర్సీస్ లో రికార్డు స్థాయి స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా, ఈ సంక్రాంతికి రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న ‘నాయక్' చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానగణం సంబరపడిపోతున్నారు.
...avnk

Nayak Movie Sensor Report

Naayak-Movie-Latestew
       
        మెగాపవర్ స్టార్ రామ్ చరణ్  మాస్ లీడర్ గా కనిపించబోతోన్న మూవీ ‘నాయక్’ ఇంకో ఐదురోజుల్లో వెండితెరలపై అలజడి రేపనుంది.  సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కొంచెం సేపటి క్రితం ‘ఎ’ సర్టిఫికేట్ ప్రజంట్ చేసింది. మనకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా లో పోసాని కామెడీ కేక పుట్టింస్తుందని తెలుస్తోంది. సెంకండాఫ్ లో 45 నిమిషాలపాటు వినాయక్ టేకింగ్ అద్భుతమట. రామ్ చరణ్ నటన ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా అరిపించాడంటున్నారు. సెన్సార్ సభ్యులు కూడా చిత్రం చూసి బాగా ఎంజాయ్ చేసినట్టు వినికిడి. 
      
        ఈ పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్లో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ – అమలా పాల్ జోడీ కట్టారు.  వి.వి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని డి.వి.వి దానయ్య నిర్మించాడు. ఎస్.ఎస్ తమన్ సంగీతం. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారి ఈ మూవీ ద్వారా చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడు.
...avnk

Ram Gopal Varma Daughter Revathy Engaged


Ram Gopal Varma Daughter Revathy Engaged

  డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు పెట్టింది పేరు.  రామ్ గోపాల్  వర్మ ఎప్పుడు  మీడియాలో  ఉండాలనే  భావం కలిగిన వ్యక్తి.  అనంతపురం  ఫ్యాక్షన్  గురించి  రక్తచరిత్ర, వన్ , టూ అంటూ  సినిమా తీసిన విషయం తెలిసిందే. అయితే  వర్మ అంటే వివాదం అనే అర్థం వచ్చే విధంగా  ఆయన పేరు తెచ్చుకున్నాడు.  అలాంటి  వర్మ ఇప్పుడు  మామగారు కాబోతున్నారు.  ఆయన త్వరలో మామగారి హోదాలోకి వెళ్లబోతున్నాడు.  ఇప్పుటి వరకు  దర్శకుడు వర్మగానే అందరి తెలుసు. ఇక ఒక నుండి సామాజంలో ఒక వ్యక్తిగా, ఇక అందరికి పరిచయం అవుతారు.   హక్కులు, డిమాండ్లకు సంబంధించిన రిలేషన్ కాదు మాది. వర్మ నాన్నకి సంప్రదాయాలపట్ల నమ్మకం లేదని తెలుసు. అయితే వ్యక్తిగతంగా ఆయన ఆ సమయంలో ఉంటే నిజంగా చాలా సంతోషిస్తాను... ఈ మాటలు అన్నది ఎవరో కాదు రామ్‌గోపాల్‌వర్మ ఏకైక కుమార్తె రేవతి. ఇటీవల విడుదలైన ‘వోడ్కా విత్ వర్మ’ అనే పుస్తకంలో... ‘మీ పెళ్లి సందర్భంగా జరిగే సంప్రదాయాల్లో మీ తండ్రి ఉండాలని కోరుకుంటారా?’ అన్న ప్రశ్నకు రేవతి చెప్పిన సమాధానం ఇది.  రేవతి కోరుకున్నట్లుగానే ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించారు రామ్‌గోపాల్‌వర్మ.  హైదరాబాద్‌లో ప్రణవ్‌తో రేవతి నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే రేవతి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె మనువాడబోతున్న ప్రణవ్ కూడా డాక్టరే అని సమాచారం. ఈ ఇద్దరూ గత తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారట.

Ram Gopal Varma Daughter Revathy Engaged

  ఇది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని వినికిడి.  ఈ నిశ్చితార్థ వేడుకలో సతీసమేతంగా ఎం.ఎం. కీరవాణి, రాజమౌళి, గుణ్ణం గంగరాజు, సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారట. ఆహ్వాన ఏర్పాట్లన్నీ వర్మే స్వయంగా పర్యవేక్షించారు. ఓ తండ్రిగా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే చూడముచ్చటగా అనిపించిందని రాజమౌళి ట్విట్టర్‌లో పెట్టారు. రేవతి, ప్రణవ్‌ల వివాహం ఆగస్ట్‌లో జరగనుందట. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు నేరాలు, ఘోరాలు , భూతాలు , చూపించి  సినీ ప్రజలను భయంతో  చంపేసే వర్మ, మొట్ట మొదట సారిగా ఒక ప్రేమ పెళ్లికి ఓప్పుకోవటం చాలా విశేషంగా ఉందని  ఆయన అభిమానులు అంటున్నారు.  అంతేకాకుండా ఆయనే స్వయంగా  పెళ్లి పనులు చేసి, ఒక తండ్రి విలువ ఏంటో  వర్మకు తెలిసిందని సినీ పెద్దలు అనుకుంటున్నారు.  వర్మ కూతురు రేవతి  చాలా ఆనందంగా  ఉన్నట్లు తెలుస్తోంది.  తండ్రిని తన ప్రేమ పెళ్లికి ఎలా ఒప్పించిందని  సినీ ప్రజలు  గుసగుసలాడుకుంటున్నారు. 

TV Anchor VJ Lasya

VJ-Lasya

  ఇండస్ట్రీలో కొద్దిగా ఫ్రెష్ గా ఏ అమ్మాయి కనిపించినా మన దర్శక నిర్మాతలు వాళ్ళతో చేసేదాక వదిలి పెట్టరు. వారికి ఇష్టం లేకున్నా మరీ పట్టుబట్టి, మభ్యపెట్టి ఒప్పించేస్తారు. ముఖ్యంగా మనవాళ్లు టీవీ యాంకర్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. బుల్లి తెరకు ఎవరైనా కొత్తగా యాంకరింగ్ కి వచ్చి, ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటే చాలు... ఆ అమ్మడుకి మన వాళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి పనికానిస్తారు. 

  తాజాగా బుల్లితెర ప్రేక్షకులను తన హావభావాలతో ఆకట్టుకుంటున్న విజె లాస్య కోసం మన టాలీవుడ్ దర్శకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం టీవీ9లో పనిచేస్తున్న లాస్య పై మనవారి కన్నుపడింది. దీంతో చిన్నచిన్న దర్శక నిర్మాతలు నిన్ను హీరోయిన్ గా చేస్తాం అని ఆమె చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట. 

గతంలో కూడా ఎంతో మంది యాంకర్లకు కూడా ఇలాంటి ఆశ చూపి, అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేసి, వారి కెరియర్ తో ఆడుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాకు వస్తే... జాన్సీ నుండి ఉదయ భాను వరకు, వంట ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెర పై మెరిన కలర్స్ స్వాతి నుండి ఇప్పటి రేష్మి వరకు ఇలా చాలా మందిని వాడుకొని వదిలేశారు మన తెలుగు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వారు అటు పూర్తి స్థాయి హీరోయిన్ గా కాకుండా, పూర్తి స్థాయి యాంకర్ గా కాకుండా పోతున్నారు. చివరకు ఉదయభాను లాంటి వాళ్ళు ఐటెం పాప అవతారం ఎత్తారు. ఇప్పుడు లాస్యని తమ లాజిక్కులతో బుల్లో వేసుకొని తరువాత వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు సినీ జనాలు.

Wednesday, 2 January 2013

Bapu Appreciation To Midhunam Movie

bhrani
       
   ప్రముఖ సినీ నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘మిథునం’ అందరినీ ఆకర్షిస్తూ ఓ పవిత్రమైన సినిమాగా మన్ననలు అందుకుంటుంది. ఎందరో ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి అభినందిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా విలక్షణ దర్శకుడు బాపు చేరి మిధునం మీద ప్రశంసలు కురిపించారు.
m       
   ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం గురించి బాపు, దర్శకుడు తనికెళ్ళ భరణికి ఒక ఉత్తరం రాశారు. దీనిపై భరణి స్పందిస్తూ ఈ చిత్రానికిగాను నాకు అందిన అన్ని మెప్పుకోలలో బాపు గారి ప్రశంస ప్రత్యేకమయినదన్నారు. బాపు ప్రియమిత్రుడు దివంగత రమణ గారు రచించిన ‘మిథునం’  పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం ఇక్కడ గమనార్హం.
          స్వర వీణాపాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ చిత్రం అమెరికాలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
....avnk

Lakshmi Rai To Romance Lawrence

Lakshmi Rai to romance Lawrence

టాలీవుడ్ హీరోయిన్ డ్యాన్స్ మాస్టార్, దర్శకుడు లక్ష్మీరాయ్ లారెన్స్ ల మద్య మంచి కెమిస్ట్రీ నడుతుస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పుడు లారెన్స్ లక్ష్మీకి చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆమెతో వరుసగా రెండు చిత్రాల్లో  నటించిన  లారెన్స్  కాంచనతో  సినిమాతో  హిట్  ఇచ్చాడు.  అయితే ఆమెను రెబల్  సినిమాలో  సెకండ్  హీరోయిన్ గా  తీసుకోవాటానికి  లారెన్స్  చాలా ట్రై చేసినట్లు  సమాచారం. కానీ హీరో  ప్రభాస్ ఒప్పుకోకపోవటంతో  లారెన్స్ వెనక్కి తగ్గాడు.   అప్పటి నుండి లక్ష్మీతో  కొంచెం డిస్టెన్స్  మెయింటైన్  చేస్తున్నాడు.  కానీ ఇప్పుడు  బెల్లకొండ సురేష్ తో  కలిసి  కాంచన  సీక్వెల్  తీసే పనిలో ఉన్నాడు.  అయితే లక్ష్మీ కాంచన సీక్వెల్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ లారెన్స్ మాత్రం లక్ష్మీని పూర్తి లాక్ చేసినట్లు సమాచారం.   కాంచన సీక్వెల్ సినిమాలో   తెల్ల పిల్ల  తాప్పీని   హీరోయిన్ గా  తీసుకోవటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.  అయితే విషయం తెలుసుకున్న  లక్ష్మీరాయ్  లారెన్స్ కాలర్ పట్టుకొని అడిగినట్లు  కోలీవుడ్ వర్గాలు  గుసగుసలాడుకుంటున్నాయి.   కాంచన సీక్వెల్   బెల్లంకొండు సురేస్ కాబట్టి  చాలా జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో   లారెన్స్  లక్ష్మీ ని దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే లక్ష్మీ కంటే  తాప్పీ బెటర్ అనిపించి  ఆమె  తీసుకోవటం జరిగినట్లు తెలుస్తోంది.
Lakshmi Rai to romance Lawrence
లక్ష్మీ మాత్రం  లారెన్స్  నన్నుమోసం చేశాడని , అతని అన్ని అర్పించాను.  అతను నిర్మించే ప్రతి సినిమాలో  లక్ష్మీని హీరోయిన్ గా తీసుకుంటానని  లారెన్స్  మాటిచ్చినట్లు ఆమె చెబుతుంది. అందుకే  సర్వం సుఖాలు లారెన్స్ కు చూపించాని ఆమె తన సన్నిహితుల దగ్గర చెప్పుకోని వాపోతుందట. లారెన్స్ కన్ను తెల్లపిల్ల తాప్పీ మీద పడిందని .. ఆమెను కూడా పూర్తిగా లారెన్స్ నాకేస్తాడని, లక్ష్మీ ఆవేధనతో  చెబుతుందట.  అయితే  ఈ సినిమాలో  కాకపోతు  మరో చిత్రంలో  అయినా  తనకి అవకాశమివ్వాలని లారెన్స్ అడుగుతానని ఆమె తన సన్నిహితులతో చెబుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Balakrishna New Year Calendars

 

02-balayyaee    
   నందమూరి వంశానికి విశ్వాంతరాళాన అభిమానగణం ఉన్నారు. 2013కొత్త ఏడాదిని పురస్కరించుకుని అఖిల భారత నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం, బాలయ్య యువసేన, తదితర సంఘాలు బాలయ్యబాబు ముఖ చిత్రంతోకూడిన  క్యాలండర్  లను రూపొందించి విడుదల చేశాయి.

balaya_calendere
      
     అంతేకాదు ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులు బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి రూ.10వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ తమ కుటుంభానికి అభిమానులే కొండంత అండ అని పేర్కొన్నారు. విరాళమిచ్చిన అభిమానుల వివరాలను ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ మీడియా కమిటీ ఛైర్మన్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు. 
....avnk