Friday, 4 January 2013

TV Anchor VJ Lasya

VJ-Lasya

  ఇండస్ట్రీలో కొద్దిగా ఫ్రెష్ గా ఏ అమ్మాయి కనిపించినా మన దర్శక నిర్మాతలు వాళ్ళతో చేసేదాక వదిలి పెట్టరు. వారికి ఇష్టం లేకున్నా మరీ పట్టుబట్టి, మభ్యపెట్టి ఒప్పించేస్తారు. ముఖ్యంగా మనవాళ్లు టీవీ యాంకర్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. బుల్లి తెరకు ఎవరైనా కొత్తగా యాంకరింగ్ కి వచ్చి, ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటే చాలు... ఆ అమ్మడుకి మన వాళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చి పనికానిస్తారు. 

  తాజాగా బుల్లితెర ప్రేక్షకులను తన హావభావాలతో ఆకట్టుకుంటున్న విజె లాస్య కోసం మన టాలీవుడ్ దర్శకులు ఎగబడుతున్నారు. ప్రస్తుతం టీవీ9లో పనిచేస్తున్న లాస్య పై మనవారి కన్నుపడింది. దీంతో చిన్నచిన్న దర్శక నిర్మాతలు నిన్ను హీరోయిన్ గా చేస్తాం అని ఆమె చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారట. 

గతంలో కూడా ఎంతో మంది యాంకర్లకు కూడా ఇలాంటి ఆశ చూపి, అవసరం ఉన్నంత వరకు వాడుకొని వదిలేసి, వారి కెరియర్ తో ఆడుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ జాబితాకు వస్తే... జాన్సీ నుండి ఉదయ భాను వరకు, వంట ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెర పై మెరిన కలర్స్ స్వాతి నుండి ఇప్పటి రేష్మి వరకు ఇలా చాలా మందిని వాడుకొని వదిలేశారు మన తెలుగు దర్శక నిర్మాతలు. ఇప్పుడు వారు అటు పూర్తి స్థాయి హీరోయిన్ గా కాకుండా, పూర్తి స్థాయి యాంకర్ గా కాకుండా పోతున్నారు. చివరకు ఉదయభాను లాంటి వాళ్ళు ఐటెం పాప అవతారం ఎత్తారు. ఇప్పుడు లాస్యని తమ లాజిక్కులతో బుల్లో వేసుకొని తరువాత వదిలేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు సినీ జనాలు.

No comments:

Post a Comment