Wednesday, 2 January 2013

Bapu Appreciation To Midhunam Movie

bhrani
       
   ప్రముఖ సినీ నటుడు, రచయిత అయిన తనికెళ్ళ భరణి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘మిథునం’ అందరినీ ఆకర్షిస్తూ ఓ పవిత్రమైన సినిమాగా మన్ననలు అందుకుంటుంది. ఎందరో ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి అభినందిస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా విలక్షణ దర్శకుడు బాపు చేరి మిధునం మీద ప్రశంసలు కురిపించారు.
m       
   ఎస్పీ బాలసుబ్రమణ్యం, లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం గురించి బాపు, దర్శకుడు తనికెళ్ళ భరణికి ఒక ఉత్తరం రాశారు. దీనిపై భరణి స్పందిస్తూ ఈ చిత్రానికిగాను నాకు అందిన అన్ని మెప్పుకోలలో బాపు గారి ప్రశంస ప్రత్యేకమయినదన్నారు. బాపు ప్రియమిత్రుడు దివంగత రమణ గారు రచించిన ‘మిథునం’  పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం ఇక్కడ గమనార్హం.
          స్వర వీణాపాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు ఈ చిత్రం అమెరికాలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
....avnk

No comments:

Post a Comment