డైరెక్టర్
రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు పెట్టింది పేరు. రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు మీడియాలో ఉండాలనే భావం కలిగిన వ్యక్తి. అనంతపురం ఫ్యాక్షన్
గురించి రక్తచరిత్ర, వన్ , టూ అంటూ సినిమా తీసిన విషయం తెలిసిందే. అయితే
వర్మ అంటే వివాదం అనే అర్థం వచ్చే విధంగా ఆయన పేరు తెచ్చుకున్నాడు.
అలాంటి వర్మ ఇప్పుడు మామగారు కాబోతున్నారు. ఆయన త్వరలో మామగారి హోదాలోకి
వెళ్లబోతున్నాడు. ఇప్పుటి వరకు దర్శకుడు వర్మగానే అందరి తెలుసు. ఇక ఒక
నుండి సామాజంలో ఒక వ్యక్తిగా, ఇక అందరికి పరిచయం అవుతారు. హక్కులు, డిమాండ్లకు
సంబంధించిన రిలేషన్ కాదు మాది. వర్మ నాన్నకి సంప్రదాయాలపట్ల నమ్మకం లేదని
తెలుసు. అయితే వ్యక్తిగతంగా ఆయన ఆ సమయంలో ఉంటే నిజంగా చాలా సంతోషిస్తాను...
ఈ మాటలు అన్నది ఎవరో కాదు రామ్‌గోపాల్‌వర్మ ఏకైక కుమార్తె రేవతి. ఇటీవల విడుదలైన ‘వోడ్కా విత్ వర్మ’ అనే పుస్తకంలో... ‘మీ పెళ్లి సందర్భంగా జరిగే సంప్రదాయాల్లో మీ తండ్రి ఉండాలని కోరుకుంటారా?’ అన్న
ప్రశ్నకు రేవతి చెప్పిన సమాధానం ఇది. రేవతి కోరుకున్నట్లుగానే ఓ తండ్రిగా
తన బాధ్యతను నిర్వర్తించారు రామ్‌గోపాల్‌వర్మ. హైదరాబాద్‌లో ప్రణవ్‌తో
రేవతి నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే రేవతి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె
మనువాడబోతున్న ప్రణవ్ కూడా డాక్టరే అని సమాచారం. ఈ ఇద్దరూ గత
తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారట.
ఇది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని వినికిడి. ఈ నిశ్చితార్థ వేడుకలో సతీసమేతంగా ఎం.ఎం. కీరవాణి, రాజమౌళి, గుణ్ణం గంగరాజు, సిరివెన్నెల
సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారట. ఆహ్వాన ఏర్పాట్లన్నీ వర్మే
స్వయంగా పర్యవేక్షించారు. ఓ తండ్రిగా వర్మ బాధ్యతలు నిర్వర్తిస్తుంటే
చూడముచ్చటగా అనిపించిందని రాజమౌళి ట్విట్టర్‌లో పెట్టారు. రేవతి, ప్రణవ్‌ల
వివాహం ఆగస్ట్‌లో జరగనుందట. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు నేరాలు, ఘోరాలు ,
భూతాలు , చూపించి సినీ ప్రజలను భయంతో చంపేసే వర్మ, మొట్ట మొదట సారిగా ఒక
ప్రేమ పెళ్లికి ఓప్పుకోవటం చాలా విశేషంగా ఉందని ఆయన అభిమానులు
అంటున్నారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా పెళ్లి పనులు చేసి, ఒక తండ్రి
విలువ ఏంటో వర్మకు తెలిసిందని సినీ పెద్దలు అనుకుంటున్నారు. వర్మ కూతురు రేవతి చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రిని తన ప్రేమ పెళ్లికి
ఎలా ఒప్పించిందని సినీ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
No comments:
Post a Comment