Saturday, 11 May 2013

Ramyasri Coming Back With Hot Movie O Malli

Ramyasri Coming Back With Hot Movie O Malli

 
Ramyasri Coming Back with Hot movie O Malli.png

అందాల సుందరి, హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రమ్య శ్రీ తన ఘాటు అందాలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన విషయం తెలిసిందే. ఈ భాష, ఆభాష అని తేడా లేకుండా  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, భోజ్ పురి ఇలా పలు భాషల్లో దాదాపు 250 చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు ఇన్నాళ్ళ నుండి తీరని కోరిక ఒకటి మదిలో మిగిలిపోయింది. ఆ కోరికను తాజాగా నెరవేర్చుకుంది. ఎన్నాళ్ళ నుండో మెగా ఫోన్ పట్టాలనుకుంటున్న రమ్య శ్రీ టైం కలిసిరాక ఆ పనిచేయలేదు. కానీ తాజాగా ఈ అమ్మడు మెగా ఫోన్ పట్టి, ఆమె అందులో కీలక పాత్ర పోషిస్తూ ‘ఓ మల్లి ’ పేరుతో  ఓ సినిమాని తెరకెక్కించింది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు రమ్యశ్రీ తెలిపింది. ఈ చిత్రంలో రమ్య హాట్ హాట్ గా కనిపిస్తుంది.

Kajal Have No Offers In Tollywood


Kajal Have No Offers In Tollywood

Kajal Have no offers in Tollywood.png

టాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరిగా వెలిగిపోతున్న కాజల్ కి ఏమీ లేవా ? అంటే చేతిలో ఒక్క సినిమా కూడా లేదా అంటే అవుననే అనిపిస్తుంది. బాలీవుడ్ హీరోలు ఈ అమ్మడు పై మోజు పడుతున్నా, తెలుగు లో మాత్రం ఈ అమ్మడు చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే ఉంది. అది ఎప్పుడో కాల్షీట్లు ఇచ్చేసిన ‘ఎవడు ’. ఆ సినిమా తరువాత తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదు. దీనికి కారణం అమ్మడు అత్యాశకు పోయి, భారీగా పారితోషికం పెంచేయడమే కారణం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. ఈ విషయం పై మీడియారు ప్రశ్నించగా అదేం కాదంటూ కాస్తంత ఘాటుగానే స్పందించింది. నేను ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. 

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ హీరో విజయ్ ప్రక్కన ‘జిల్లా ’ సినిమాలో, కార్తీతో ఓ సినిమాలో చేస్తుంది. వీటితోనే టైం సరిపోతుంది. ఇక కొత్త సినిమాలు చేసే టైం ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇక కాజల్ పారితోషికం పెంచిన కారణంగా అవకాశాలు రావడం లేదనటం కరెక్టు కాదు అని చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు నాలుగు కంటే ఎక్కువ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మూడు సినిమాలకే డేట్లు లేవనడం వెనుక రేటు భారీగా పెంచడం తోనే కాజల్ ని ప్రక్కన పెట్టేశారని అనుకుంటున్నారు సినీ జనాలు.

Junior NTR Tribul Role In New Movie

Junior NTR Tribul Role In New Movie

junior ntr  tribul role in new movie.png

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రామయ్యా వస్తావయ్యా.. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనేది వార్త. కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఇందులో ఇద్దరు ఎన్టీఆర్ లే కాకుండా మరో ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తాడట. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంటు పాత్రలో దర్శనమిస్తుండగా, ఇందులో సీనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించబోతున్నాడట. 

ఓన్లీ గ్రాఫిక్స్ తోనే సీనియర్ ఎన్టీఆర్ ని దించుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. గతంలో ఈయన డబుల్ రోల్ పోషించిన సినిమాలో తండ్రీ కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడోనని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Friday, 3 May 2013

Kajal 1.5 Crore For Gabbar Singh 2

Kajal 1.5 Crore For Gabbar Singh 2

Kajal asking 1.5 Crore for Gabbar Singh-2.png

టాలీవుడ్ లో పలువురు నాయికలు రేజింగ్ లో ఉన్నారు. ఈ భామలు ఏది పడితే అది బంగారం అవుతుంది. ఈ కోవలోకి కాజల్, తమన్నా, సమంతా, శ్రుతి హాసన్ లాంటి వాళ్లు వస్తారు. ఈ మధ్య కాజల్ అగర్వాల్ నటించిన తుపాకి,నాయక్, బాద్‌షా సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. దీంతో ఈ అమ్మడుకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న కాజల్ తాజాగా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ చిత్రానికి సీక్వెల్‌ గా సంపత్‌నంది దర్శకత్వంలో పవన్ సరసన నటింపజేయమని నిర్మాతాలు అడిగితే ఈ అమ్మడు తన రేటును భారీగా పెంచేసిందట. పవన్ ఫ్రెండ్ అయిన శరత్‌మరార్ నిర్మించే ఈ సినిమా కోసం ఆమె కోటిన్నర డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాత ఒక్కసారి నోరెళ్లబెట్టాడట. మరి అంత రేటు చెల్లించి ఈమెను తీసుకుంటారో లేదో చూడాలి. ఇక గతంలో  ‘గబ్బర్‌సింగ్ ’లో నటించాల్సిన కాజల్ డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.


Nayanthara Not In Balakrishna New Movie

 
బాలయ్య నయన్ పై మోజు తీరింది

Nayanthara Not In Balakrishna New Movie.png

నందమూరి నట సింహం బాలయ్య తనకు చాలా కాలం తరువాత ‘సింహా ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన బోయపాటి శీను దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన గత రెండు చిత్రాల్లో నటించిన నయనతార నే హీరోయిన్ గానటించబోతున్నదని, దీంతో ముచ్చటగా మూడో సారి ఈ జంట కనువిందు చేయబోతుందని టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపించాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదే జంట అయితే బాలయ్య ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని భావించారు. అయితే దర్శకుడు బోయపాటి శీను స్పందిస్తూ.... ఈ చిత్రంలో నయనతారను తీసుకోవడం లేదని, ఈమె ఈ కథకు సూట్ కాదని తేల్చి చెప్పడంతో ఈ చిత్రంలో బాలయ్య సరసన ఎవరనే విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఆసిన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. దీనికి ‘రూలర్ ’ అనే టైటిల్ ఖరారు చేసిన దర్శకుడు. అయిదే అదే పేరుతో మరో దర్శకుడు కె.ఎస్. రామారావు ‘రామ్ చరణ్ ’ కోసం ఫిలిం ఛాంబర్ లో రిజిష్టర్ చేశాడు. వీరిద్దరిలో ‘రూలర్ ’ ఎవరనేది త్వరలో తేలిపోనుంది.

ఇక ఈ చిత్రంలో నయనతారను బాలయ్యకు కూడా కాస్తంత అయిష్టంగానే అనిపించిందట. దీంతో దర్శకుడు ఆ ప్రకటన చేశాడని అంటున్నారు. అయితే సినీ జనాలు మాత్రం బాలయ్యకు హిట్ ఇచ్చిన చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చిన నయన తార పై ఆయనకు మోజు తీరిందని, కొత్త హీరోయిన్ కోసమే నయన తారను వద్దన్నాడని అనుకుంటున్నారు.

Pawan Kalyan Six Pack For Gabbar Singh 2

Pawan Kalyan Six Pack body.png

ఒకప్పుడు యూత్ పవన్ కళ్యాణ్ బాడీకి, ఆయన చేసే రియాల్టీ విన్యాసాలకు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఆయన కెరియర్ ప్రారంభంలో ఏ హీరో చేయనంతగా విన్యాసాలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కి అంత క్రేజ్ రావడానికి అవే కారణం అని చెప్పవచ్చు. ఇక ఆ తరువాత నటించిన సినిమాల్లో ఎలాంటి విన్యాసాలు చేయకపోగా, ఇటీవలి కాలంలో పవన్ కాస్తంత బొద్దుగా తయారయ్యాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో మరింత లావుగా కనిపించడంతో ఆయన అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు. దీంతో పవన్ మళ్లీ తన బాడీ పై శ్రద్ద పెట్టాడని అంటున్నాడు. త్వరలో పవన్ నటించబోతున్న ‘గబ్బర్ సింగ్ -2 ’ సీక్వెల్ ఆయన సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించబోతున్నాడట. ఇందుకోసం ఆయన బెంగుళూరు లోని ప్రముఖ జిమ్ లో సిక్స్ ప్యాక్ బాడీ రావడానికి కసరత్తులు మొదలు పెట్టాడట. ఈ సినిమా త్రివిక్రమ్ తో తీస్తున్న సినిమా తరువాత సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడు.

Mahesh Role Leaked In Pawan Kalyan Movie

Mahesh Role Leaked In Pawan Kalyan Movie

 
Mahesh Role Leaked In Pawan Kalyan Movie.png

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అత్తారింటికి దారేది ’ అనే  డిఫరెంట్ టైటిల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సినిమాకు ప్రత్యేక హంగులు హద్దుతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాలో ఓ ఎన్నారై యువకుడి పాత్రలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటింపజేస్తున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. కొన్ని నిమిషాల నివిడి ఉండే ఈ పాత్రలో మహేష్ ఇండియాకు రావడం... అతన్ని రిసీవ్ చేసుకోవడానికి పవన్ ఎయిర్ పోర్టుకి వెళ్ళడం.. ఇద్దరూ కలుసుకోగానే...  తమ చిన్ననాటి స్మృతులను నెమరువేసుకోవడం... జరుగుతుందని, ఈ కొద్ది నిమిషాల సన్నివేశాలు సినిమాలో ఎంతో కీలకం అని అంటున్నారు. టాలీవుడ్ లో వీరిద్దరు స్టార్ హీరోలు కావడం, వీరిద్దరు కలిసి ఓకేసారి వెండితెర పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. ఇక గతంలో మహేష్ పవన్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా నటిస్తున్నాడని తెలియడంతో ఇటు పవన్, అటు మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.