Junior NTR Tribul Role In New Movie
యంగ్
టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో
రూపొందుతున్న సినిమా రామయ్యా వస్తావయ్యా.. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్
జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ
సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనేది వార్త. కానీ
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. ఇందులో
ఇద్దరు ఎన్టీఆర్ లే కాకుండా మరో ఎన్టీఆర్ కూడా దర్శనమిస్తాడట. జూనియర్
ఎన్టీఆర్ స్టూడెంటు పాత్రలో దర్శనమిస్తుండగా, ఇందులో సీనియర్ ఎన్టీఆర్ కూడా
కనిపించబోతున్నాడట.
ఓన్లీ గ్రాఫిక్స్ తోనే సీనియర్ ఎన్టీఆర్ ని
దించుతున్నట్లు ఫిలింనగర్ సమాచారం. గతంలో ఈయన డబుల్ రోల్ పోషించిన సినిమాలో
తండ్రీ కొడుకులుగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎలాంటి పాత్రలో
కనిపిస్తాడోనని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
No comments:
Post a Comment