Ramyasri Coming Back With Hot Movie O Malli
అందాల
సుందరి, హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రమ్య శ్రీ తన ఘాటు అందాలతో
ప్రేక్షకుల్ని మత్తెక్కించిన విషయం తెలిసిందే. ఈ భాష, ఆభాష అని తేడా
లేకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, భోజ్ పురి ఇలా పలు భాషల్లో దాదాపు
250 చిత్రాల్లో నటించిన ఈ అమ్మడుకు ఇన్నాళ్ళ నుండి తీరని కోరిక ఒకటి మదిలో
మిగిలిపోయింది. ఆ కోరికను తాజాగా నెరవేర్చుకుంది. ఎన్నాళ్ళ నుండో మెగా ఫోన్
పట్టాలనుకుంటున్న రమ్య శ్రీ టైం కలిసిరాక ఆ పనిచేయలేదు. కానీ తాజాగా ఈ
అమ్మడు మెగా ఫోన్ పట్టి, ఆమె అందులో కీలక పాత్ర పోషిస్తూ ‘ఓ మల్లి ’
పేరుతో ఓ సినిమాని తెరకెక్కించింది. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న
సమస్యల నేపథ్యంలో ఆ చిత్రాన్ని తెరకెక్కించినట్లు రమ్యశ్రీ తెలిపింది. ఈ
చిత్రంలో రమ్య హాట్ హాట్ గా కనిపిస్తుంది.
No comments:
Post a Comment