Friday, 3 May 2013

Nayanthara Not In Balakrishna New Movie

 
బాలయ్య నయన్ పై మోజు తీరింది

Nayanthara Not In Balakrishna New Movie.png

నందమూరి నట సింహం బాలయ్య తనకు చాలా కాలం తరువాత ‘సింహా ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన బోయపాటి శీను దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన గత రెండు చిత్రాల్లో నటించిన నయనతార నే హీరోయిన్ గానటించబోతున్నదని, దీంతో ముచ్చటగా మూడో సారి ఈ జంట కనువిందు చేయబోతుందని టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపించాయి. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదే జంట అయితే బాలయ్య ఖాతాలో మరో హిట్ పడ్డట్లే అని భావించారు. అయితే దర్శకుడు బోయపాటి శీను స్పందిస్తూ.... ఈ చిత్రంలో నయనతారను తీసుకోవడం లేదని, ఈమె ఈ కథకు సూట్ కాదని తేల్చి చెప్పడంతో ఈ చిత్రంలో బాలయ్య సరసన ఎవరనే విషయం పై ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో హీరోయిన్ గా ఆసిన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ కూడా వివాదాల్లో చిక్కుకుంది. దీనికి ‘రూలర్ ’ అనే టైటిల్ ఖరారు చేసిన దర్శకుడు. అయిదే అదే పేరుతో మరో దర్శకుడు కె.ఎస్. రామారావు ‘రామ్ చరణ్ ’ కోసం ఫిలిం ఛాంబర్ లో రిజిష్టర్ చేశాడు. వీరిద్దరిలో ‘రూలర్ ’ ఎవరనేది త్వరలో తేలిపోనుంది.

ఇక ఈ చిత్రంలో నయనతారను బాలయ్యకు కూడా కాస్తంత అయిష్టంగానే అనిపించిందట. దీంతో దర్శకుడు ఆ ప్రకటన చేశాడని అంటున్నారు. అయితే సినీ జనాలు మాత్రం బాలయ్యకు హిట్ ఇచ్చిన చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చిన నయన తార పై ఆయనకు మోజు తీరిందని, కొత్త హీరోయిన్ కోసమే నయన తారను వద్దన్నాడని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment