Kajal Have No Offers In Tollywood
టాలీవుడ్
అగ్ర తారల్లో ఒకరిగా వెలిగిపోతున్న కాజల్ కి ఏమీ లేవా ? అంటే చేతిలో ఒక్క
సినిమా కూడా లేదా అంటే అవుననే అనిపిస్తుంది. బాలీవుడ్ హీరోలు ఈ అమ్మడు పై
మోజు పడుతున్నా, తెలుగు లో మాత్రం ఈ అమ్మడు చేతిలో ఒకే ఒక్క సినిమా మాత్రమే
ఉంది. అది ఎప్పుడో కాల్షీట్లు ఇచ్చేసిన ‘ఎవడు ’. ఆ సినిమా తరువాత తెలుగులో
ఒక్క అవకాశం కూడా రాలేదు. దీనికి కారణం అమ్మడు అత్యాశకు పోయి, భారీగా
పారితోషికం పెంచేయడమే కారణం అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్న మాట. ఈ విషయం
పై మీడియారు ప్రశ్నించగా అదేం కాదంటూ కాస్తంత ఘాటుగానే స్పందించింది. నేను
ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే తెలుగులో సినిమాలు
ఒప్పుకోవడం లేదని కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ
హీరో విజయ్ ప్రక్కన ‘జిల్లా ’ సినిమాలో, కార్తీతో ఓ సినిమాలో చేస్తుంది.
వీటితోనే టైం సరిపోతుంది. ఇక కొత్త సినిమాలు చేసే టైం ఎక్కడుందని ఎదురు
ప్రశ్నిస్తుంది. ఇక కాజల్ పారితోషికం పెంచిన కారణంగా అవకాశాలు రావడం
లేదనటం కరెక్టు కాదు అని చెప్పుకొచ్చింది. మొన్నటి వరకు నాలుగు కంటే ఎక్కువ
సినిమాల్లో నటించిన ఈ అమ్మడు మూడు సినిమాలకే డేట్లు లేవనడం వెనుక రేటు
భారీగా పెంచడం తోనే కాజల్ ని ప్రక్కన పెట్టేశారని అనుకుంటున్నారు సినీ
జనాలు.
No comments:
Post a Comment