Tuesday, 14 May 2013

Sanjay Dutt Gets No Reprieve From SC

Sanjay Dutt Gets No Reprieve From Supreme Court


1993 నాటి ముంబై పేళుళ్ళ కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సంజయ్ ని ఈ నెల 16వ తేదీన లొంగిపోవాలని అదేశాలు ఇచ్చింది. అయితే సంజయ్ దత్ తన లొంగుబాటుకు మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని దత్ సుప్రీం కోర్టులోరివ్యూ పిటీషన్ వేసుకున్నాడు. అయితే దీని పై విచారించిన  కోర్టు నేడు దానిని తిరస్కరించింది. దీంతో మున్నాభాయ్ మరో రెండు రోజుల్లో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సంజయ్ తో సినిమాలు చేసే దర్శకులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ప్రస్తుతం సంజయ్ దత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

Sunny Leone Opposite Amitabh Bachchan In Welcome 2

Sunny Leone Amitabh Bachchan In Welcome 2


ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ గా గుర్తింపు పొంది, బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టి, బాలీవుడ్ హీరోయిన్ గా మారి, ముంబయిలో మకాం పెట్టి హీరోయిన్లకే పోటీ ఇస్తున్న సన్నిలియోన్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతూ, నిద్ర లేకుండా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరసన సన్నిలియోన్ నటించడానికి సిద్ధం అయింది. అసలు విషయం ఏంటేంటే... 2007 సంవత్సరంలో వచ్చిన ‘వెల్ కమ్ ’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. ఈ సినిమాలో ఆ సినిమాలో ఫిరోజ్ ఖాన్ పోషించిన పాత్రలో అమితాబ్ ని తీసుకున్నారు. ఇక మల్లికా షెరావత్ పోషించిన పాత్రలో సన్నీని తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 

దీని కోసం సన్నీకి ఏకంగా 5 కోట్ల రూపాలయలు కూడా ముట్టజెప్పడానికి సిద్దమయ్యారట దర్శక నిర్మాతలు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు ఒక్క సారి షాక్ తినడమే కాకుండా, అమితాబ్ తో చిందులేసే అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కుందని అనుకుంటున్నారు. మరి అంత రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకుంటున్నారంటే ఆ సినిమాలో సన్నీ ఏ రేంజ్ లో చూపించబోతుందోనని జనాలు ఎదురు చూస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మిగతా హాట్ భామలకు మింగుడు పడటం లేదట.

Mayabazar Is First Place In CNN IBN Channel Poll


Mayabazar Is First Place In CNN IBN Channel Poll


భారతీయ సినిమా ఇండస్ట్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వందేళ్ళ కాలంలో ఈ రంగుల ప్రపంచం ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ఈ వంద సంవత్సరాలలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. ఎంతో మంది గొప్ప గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధ్బుత ద్రుశ్య కావ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘మాయాబజార్ ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ భాషలన్నింటిలో వచ్చిన మహా మహా చిత్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. జాతీయ వార్తా ఛానల్ -  ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ పోల్ లో ఈ సినిమాకే పట్టం కట్టారు. 1957లో తొలిసారిగా తెలుగులో విడుదల అయిన ఈ చిత్రం 23.91 శాతం ఓట్లను సంపాదించుకుంది. ఆ తరువాత పలు భాషల్లో రీమేక్ చేశారు.

ప్రముఖ నిర్మాతలు అయిన చక్రపాణి, నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పటి నటులందరి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ పోల్ లో ప్రముఖ నటి శోభన నటించిన తమిళ చిత్రం ‘మనిచిత్రరాజు ’ రెండో స్థానంలో నిలిచింది. మమ్మూట్టికి అవార్డు తేవడమే కాకుండా హీరోగా తానేంటో చూపించిన మరో మళయాళ చిత్రం ‘ఓరు వడక్కన్ వీరగాథ ’ మూడో స్థానంలో నిలిచింది. రాంగోపాల్‌ వర్మ శివ.. 7 స్థానాన్ని దక్కించుకుంది. టాప్‌ 100 సినిమాల్లో తెలుగువారి ఆణిముత్యాలు అనదగ్గ పలు సినిమాలు స్థానం సంపాదించుకున్నాయి. హిందీలో సంచలన విజయం సాధించిన ‘షో ’ లే సినిమా టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంది. ఇంకా పథేర్ పాంచాలి, నాయగన్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లు టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నాయి. ‘మాయా బజార్ ’ మొదటి స్థానం దక్కించుకుందంటే... ప్రతి తెలుగు వాడు గర్వించదగిన విషయం.

Saturday, 11 May 2013

Salman Khan Going To Marry Her Girl Friend


Salman Khan Going To Marry Her Girl Friend




Salman khan going to marry her girl friend.png

బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి అయిన సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా ? ఈయన ఓ విదేశీ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడా ? ఈమెతోనే కలిసి జీవితాన్ని పంచుకోబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి రానట్లు నిమ్మకునీరెత్తినట్లు ఉండే సల్మాన్ ఫ్యూర్ బహ్మచారి అంటే డౌటే. అధికారిక బ్రహ్మచారి మాత్రమే. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది భామలతో ప్రేమ కలాపాలు సాగించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు రొమేనియన్ టీవీ నటి లులియా వాంటుర్‌తో ప్రేమాయనం నడిపిస్తున్నాడని అంటున్నారు. 

ఇటీవలే వీరిద్దరు బాంద్రాలోని ఓ హోటల్ లో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించాడని అంటున్నారు. ఇక ఈ మధ్యన మనోడు పనిగొట్టుకొని మరీ ఫారిన్ వెళ్లి ఈ అమ్మడుతో ఎంజాయ్ చేసి వస్తున్నాడనే వార్తలు కూడా మీడియాలో వినిపిస్తున్నాయి. గతంలో కూడా పలువురితో ప్రేమాయణాలు నడిపినప్పుడు కూడా ఇలాంటి వార్తలే వినిపించాయి. ఆ రికార్డులను బట్టి చూస్తే ఈ బాడీగార్డు ఈ అమ్మడునైనా పెళ్లి చేసుకొని జీవితంలో భర్తగా ఉంటాడో లేదో చూడాలి.

Tapsee New Iron Leg Of Tollywood

Tapsee New Iron Leg Of Tollywood

Tapsee New Iron Leg Of Tollywood.png

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు చేతి నుండి జాలు వారి, ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెలుగు తెరకు పరిచయం అయిన తెల్లపిల్ల తాప్సీకి తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. కానీ ఆమె నటించిన ఒకటి , రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తెల్లపిల్లకు మన తెలుగు సినిమా జనాలు ఐరెన్ లెగ్ అనే స్టాంపు గుద్దేశారు. మొన్నటి వీర నుండి నేటి షాడో వరకు అమ్మడికి వరుస ప్లాపులే వచ్చాయి. దీంతో ఆమెకు ఈ స్టాంపు గుద్దేశారు. ఇటీవల హిందీలో కూడా తన లక్ ని పరీక్షించుకోవడానికి అక్కడ ‘ఛష్మే బద్దూర్ ’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. అక్కడ ఇక పై అవకాశాలు వస్తాయో లేదో కానీ ఇక్కడ మాత్రం తాప్సీ పై ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ తో ‘సాహసం ’ సినిమాలో నటిస్తుంది. ఇది కనుక ఆశించిన ఫలితం రాకపోతే తాప్సీని ఇక్కడ జనాలు తట్టా బుట్టా సర్టేసుకోమని అనడం ఖాయం అంటున్నారు. అయితే ఇప్పటి వరకు తన తెల్ల తోలు అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ, అవకాశాలు రాబట్టుకుంటున్న తాప్సీ కి ఇక పై ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Gopichand And Tapsi Hot Romance In Sahasam

Gopichand And Tapsi Hot Romance In Sahasam

sahasam-movie-gopi.gif

గతంలో  తాప్సీ  హీరో గోపీచంద్ తో  మొగుడు అనే సినిమాలో నటించిన అనుభవం ఉండటంతో ..  షూటింగ్ లో  ఈ ఇద్దరు అందరు ముందు  హాట్ సాహసం చేస్తున్నట్లు  టాక్. తాప్సీ కూడా గోపీచంద్  చేసే సాహసమైన పనులకు ఎంతో ఆనందంగా ఉందని టాక్.  ఎంతైన  ఒకప్పటి పాతమొగుడే కదా అని  తాప్సీ కూడా గోపీ చంద్ కు  అడ్డు చెప్పటం లేదని యూనిట్ సభ్యులు అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే? గోపీచంద్‌, తాప్సీ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహసం'. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో రియల్‌ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ' రెగ్యులర్‌ సినిమాలకు విభిన్నంగా కమర్షియల్‌ అంశాలతో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఏ తెలుగు సినిమా చేయని రేర్‌ లొకేషన్ల లో చిత్రీకరించాం. గోపీ,చంద్రశేఖర్‌, మా సంస్థ కి మంచి సినిమా అవుతుంది. మే మొదటి వారంలో పాటలు, నెలాఖరున సినిమా విడుదల చేస్తాం' అన్నారు. ఇతర పాత్రల్లో శక్తికపూర్‌, ఆలీ తదితరు నటిస్తున్నారు.

Gopichand Sahasam Trailer Gets Good Response

Gopichand Sahasam Trailer Gets Good Response


Gopichand Sahasam trailer gets good response.png

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ చాలా కాలం తరువాత ‘సాహసం ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ పెద్ద సాహసమే చేసినట్లు ఈ సినిమా ట్రైలర్లను బట్టి తెలుస్తుంది. నిధి వేట నేపథ్యంలో సాగే ఈ కథలో గోపీచంద్ చేసిన సాహసాలను చూస్తే బాగానే కష్టపడ్డాని తెలుస్తుంది. ‘ప్రయాణం ’ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీసిన ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతుంది.   ట్రైలర్ సీన్లలో గోపీచంద్ గుర్రపు స్వారీ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ని చూస్తే గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారని తెలుస్తుంది. కొన్ని సీన్స్ లో కౌబాయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు గోపీచంద్. మరి ఈయన కెరియర్ లోనే చాలా సహాసం చేసి ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా జనాల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.