Sanjay Dutt Gets No Reprieve From Supreme Court
1993
నాటి ముంబై పేళుళ్ళ కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి ఐదేళ్ళ జైలు శిక్ష
విధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సంజయ్ ని ఈ నెల 16వ తేదీన
లొంగిపోవాలని అదేశాలు ఇచ్చింది. అయితే సంజయ్ దత్ తన లొంగుబాటుకు మరిన్ని
రోజులు గడువు ఇవ్వాలని దత్ సుప్రీం కోర్టులోరివ్యూ పిటీషన్ వేసుకున్నాడు. అయితే
దీని పై విచారించిన కోర్టు నేడు దానిని తిరస్కరించింది. దీంతో మున్నాభాయ్
మరో రెండు రోజుల్లో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సంజయ్ తో సినిమాలు
చేసే దర్శకులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ప్రస్తుతం సంజయ్ దత్ పలు
సినిమాల్లో బిజీగా ఉన్నాడు.
No comments:
Post a Comment