Tapsee New Iron Leg Of Tollywood
దర్శకేంద్రుడు
రాఘవేంద్ర రావు చేతి నుండి జాలు వారి, ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు
తెలుగు తెరకు పరిచయం అయిన తెల్లపిల్ల తాప్సీకి తెలుగులో మంచి అవకాశాలే
వచ్చాయి. కానీ ఆమె నటించిన ఒకటి , రెండు సినిమాలు తప్పితే మిగతా
సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో తెల్లపిల్లకు మన
తెలుగు సినిమా జనాలు ఐరెన్ లెగ్ అనే స్టాంపు గుద్దేశారు. మొన్నటి వీర నుండి
నేటి షాడో వరకు అమ్మడికి వరుస ప్లాపులే వచ్చాయి. దీంతో ఆమెకు ఈ స్టాంపు
గుద్దేశారు. ఇటీవల హిందీలో కూడా తన లక్ ని పరీక్షించుకోవడానికి అక్కడ
‘ఛష్మే బద్దూర్ ’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఫర్వాలేదనిపించుకుంది.
అక్కడ ఇక పై అవకాశాలు వస్తాయో లేదో కానీ ఇక్కడ మాత్రం తాప్సీ పై ఐరెన్ లెగ్
ముద్ర పడిపోయింది. ప్రస్తుతం ఈమె గోపీచంద్ తో ‘సాహసం ’ సినిమాలో
నటిస్తుంది. ఇది కనుక ఆశించిన ఫలితం రాకపోతే తాప్సీని ఇక్కడ జనాలు తట్టా
బుట్టా సర్టేసుకోమని అనడం ఖాయం అంటున్నారు. అయితే ఇప్పటి వరకు తన తెల్ల
తోలు అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ, అవకాశాలు రాబట్టుకుంటున్న తాప్సీ కి
ఇక పై ఎవరైనా అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.
No comments:
Post a Comment