Salman Khan Going To Marry Her Girl Friend
బాలీవుడ్
ముదురు బ్రహ్మచారి అయిన సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడా ?
ఈయన ఓ విదేశీ అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడా ? ఈమెతోనే కలిసి
జీవితాన్ని పంచుకోబోతున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా పెళ్లి రానట్లు నిమ్మకునీరెత్తినట్లు ఉండే
సల్మాన్ ఫ్యూర్ బహ్మచారి అంటే డౌటే. అధికారిక బ్రహ్మచారి మాత్రమే. ఇప్పటికే
బాలీవుడ్ లో చాలా మంది భామలతో ప్రేమ కలాపాలు సాగించిన సల్మాన్ ఖాన్
ఇప్పుడు రొమేనియన్ టీవీ నటి లులియా వాంటుర్‌తో ప్రేమాయనం నడిపిస్తున్నాడని
అంటున్నారు.
ఇటీవలే వీరిద్దరు బాంద్రాలోని ఓ హోటల్ లో తెగ ఎంజాయ్ చేస్తూ
కనిపించాడని అంటున్నారు. ఇక ఈ మధ్యన మనోడు పనిగొట్టుకొని మరీ ఫారిన్ వెళ్లి
ఈ అమ్మడుతో ఎంజాయ్ చేసి వస్తున్నాడనే వార్తలు కూడా మీడియాలో
వినిపిస్తున్నాయి. గతంలో కూడా పలువురితో ప్రేమాయణాలు నడిపినప్పుడు కూడా
ఇలాంటి వార్తలే వినిపించాయి. ఆ రికార్డులను బట్టి చూస్తే ఈ బాడీగార్డు ఈ
అమ్మడునైనా పెళ్లి చేసుకొని జీవితంలో భర్తగా ఉంటాడో లేదో చూడాలి.
No comments:
Post a Comment