Saturday, 11 May 2013

Gopichand Sahasam Trailer Gets Good Response

Gopichand Sahasam Trailer Gets Good Response


Gopichand Sahasam trailer gets good response.png

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ చాలా కాలం తరువాత ‘సాహసం ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో గోపీచంద్ పెద్ద సాహసమే చేసినట్లు ఈ సినిమా ట్రైలర్లను బట్టి తెలుస్తుంది. నిధి వేట నేపథ్యంలో సాగే ఈ కథలో గోపీచంద్ చేసిన సాహసాలను చూస్తే బాగానే కష్టపడ్డాని తెలుస్తుంది. ‘ప్రయాణం ’ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీసిన ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతుంది.   ట్రైలర్ సీన్లలో గోపీచంద్ గుర్రపు స్వారీ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ ని చూస్తే గ్రాఫిక్స్ ఎక్కువగా వాడారని తెలుస్తుంది. కొన్ని సీన్స్ లో కౌబాయ్ గెటప్ లో కనిపిస్తున్నాడు గోపీచంద్. మరి ఈయన కెరియర్ లోనే చాలా సహాసం చేసి ఎక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా జనాల్ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment