...avnk
Telugu Wishesh no delay in coverage of developments in the Telugu film and movie reviews
Tuesday, 5 February 2013
Hero Siddarth In NTR Baadsha Movie
యంగ్ టైగర్ మూవీ బాద్ షా పలు అంశాల
ప్రాతిపదికన తరచూ వార్తల్లో నిలుస్తూ హల్ చల్ స్రుష్టిస్తోంది. క్రియేటివ్
డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్‌తో
తెరకెక్కుతున్న ఈమూవీలో హీరో నవదీప్ నెగెటివ్ రోల్ పోషిస్తున్న సంగతి
తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే, హీరో సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
తెలుగు మూవీ యువ హీరోలు ఇటీవల కొంతకాలంగా, అతిథి పాత్రల్లో కనిపించడానికి
ముందుకు రావటం శుభపరిణామం. ఇదే కోవలో 'ఎవడు'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్
పోషిస్తుండగా, తులసిలో ఎన్టీఆర్ స్టెప్పులేసి అలరించిన సంగతి ఇక్కడ
గమనార్హం.
కాగా, బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడక నిర్మిస్తున్న 'బాద్‌షా'లో కాజల్ కథానాయికగా నటిస్తోంది. థమన్ స్వరాలిస్తున్నాడు.
...avnkకాగా, బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడక నిర్మిస్తున్న 'బాద్‌షా'లో కాజల్ కథానాయికగా నటిస్తోంది. థమన్ స్వరాలిస్తున్నాడు.
Monday, 4 February 2013
Rajamouli Risk For Bahubali
తెలుగు సినిమా చరిత్రలోనే దర్శకుడి గా
దాదాపు 10 సంవత్సరాల ప్రస్తానం లో ఇంతవరకు పరాజయం చవి చూడని ఒకే ఒక్క
దర్శకుడు, రాజ మౌళి... తన చేతి లో పడ్డ ప్రతీ నటుడు నటీమణి స్టార్లు గా
ఎంతో పేరు ని మరిన్ని ఆఫర్లని సంపాదించుకున్నారు... రాజ మౌళి ఈగ ని కూడా
స్టార్ గా మార్చే సత్తా ఉన్నవాడు అని మనకు రుజువయ్యింది...మరి ఈ సంవత్సరం, ఈ
దర్శకుడు, కేవలం బాక్ష్ ఆఫీసు కలేక్షన్లనే దృష్టి లో ఉంచుకుని, ప్రభాస్
కధానాయకుడిగా, రాణా ప్రతినాయకుడిగా నిర్మిస్తున్న పీరియాడిక్ చిత్రం,
'బాహుబాళి'... చిత్రం టైటిల్ యెంత పవర్ఫుల్ గా ఉందొ చిత్రం కూడా అంతే
పవర్ఫుల్ గా ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేస్తోంది రాజ మౌళి క్యాంప్... ఈ
చిత్రం లో ప్రభాస్ కి అన్ని విధాలుగా తగిన జోడి అయిన అనుష్క కధానాయిక...
అంతా బాగానే ఉంది, ప్రభాస్ రాణా కత్తి యుద్ధాలలో శిక్షణ తీసుకోవడం కూడా
మొదలు పెట్టేసారు... వీరిరువురినీ చూసి మురిసిపోతున్నాడట రాజ మౌళి...
అయితే ఒక చిక్కు ఒచ్చి పడింది... హీరో,
విలన్, హీరోయిన్, అందరు ఎత్తులో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు... వీరు
ముగ్గురిని ఒకే సారి క్యామెరా లో బంధించాలంటే మాత్రం, క్యామేరామ్యాన్ కి
చుక్కలు కనిపించడం ఖాయం...ఈ చిక్కు ని రాజ మౌళి ఏ పై ఎత్తు వేసి తీరుస్తాడో 'బాహుబాళి' లో చూడలి మరి...
Deepika Padukone Is Busy
బాలీవుడ్లో ఇప్పటి హీరోయిన్లు అందరిలోనూ
ఒక ప్రత్యెక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్, దీపిక పాడుకొనే... అటు అందం,
ఇటు చక్కని దేహాక్రుతి, ఒడ్డు, పొడుగు, ఇటు అందాల ఆరబోతకీ, అటు నటనకి
ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం, ఇలా నేటి తరం ప్రేక్షకులకు ఏం అంశాలు
కావాలో, అవన్నీ పుష్కలంగా ఉన్న నటి, దీపిక...
దీనికి తోడూ, ఎప్పుడు వెన్నంటి ఉండే
అదృష్టం కూడా దీపిక సొంతం... సంవత్సరానికి కనీసం 3 సినిమాలు చేస్తూ బిజీ
గా గడిపే దీపిక, పోయిన సంవత్సరం కేవలం 1 సినిమాని మాత్రమె రిలీజ్
చెయ్యగలిగింది. అయితే నేఁ, ఈ లోటు భర్తీ చెయ్యడానికి ఈ సంవత్సరం ఏకంగా 4
సినిమాల రిలీజ్ ని లైన్లో పెట్టింది... రన్బీర్ కపూర్ తో తాను కలిసి
నటిస్తోన్న 'ఏ జవాని హే దివానీ', రన్వీర్ సింగ్ తో 'రామ్ లీల', షా రుఖ్
ఖాన్ తో 'చెన్నై ఎక్ష్ప్రెస్స్', రజనీ కాంత్ తో 'కొచ్చాడియాన్' లో
నటిస్తోంది దీపిక...
దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ
చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే దీపిక
నటించిన రేస్ 2 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది...ఇక ఏ ఇతర బాలీవుడ్ హీరోయిన్ చెయ్యని రీతిలో 4 సినిమాల్లో నటిస్తూ రికార్డ్ సృష్టిస్తోంది
దీపిక.
Maehsh Dream Project
ప్రస్తుతం టాలీవుడ్ లో యమ దూకుడు
ప్రదర్శిస్తోన్న హీరో ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు.
ఇప్పటివరకూ ఏ తరహా పాత్ర పోషించినా.... అందులో ఎంచక్కా ఒదిగిపోయే మహేష్
చేయాలనుకుంటున్న పాత్ర ఒకటుంది. అదే గతంలో తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ
'గూఢచారి 116' సినిమాలో పోషించిన పాత్ర.
అయితే, దీనికి మంచి కథ, దానిని అదే స్థాయిలో తెరకెక్కించగలిగే దర్శకుడు కుదరాలి. అవన్నీ కుదిరినప్పుడు నేను తప్పకుండా స్పైక్యారెక్టర్ చేస్తానంటున్నాడు మహేష్ . మరి మహేష్ ఇంత చక్కటి ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు, మన యువ దర్శకులు కథలు సిద్ధం చేసుకుని ఆయనని సంప్రదించడమే ఇక తరువాయి కదా.. ఇదిలా ఉంచితే.. అప్పుడే మహేష్ మనసెరిగిన ఓ ప్రముఖ దర్శకుడు దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు వినికిడి.
మరోవైపు.. రాజమౌళి దర్శకత్వంలో తాను నటించనున్నట్టు మహేష్ బాబు స్వయంగా ప్రకటించాడు. అయితే, ఇది కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి ఇప్పటికే తాము మాట్లాడుకున్నామని మహేష్ వెల్లడించారు అంతేకాదు ప్రస్తుతం తాను సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జూన్ లో విడుదలవుతుందనీ.. శ్రీను వైట్లతో చేసే 'ఆగడు' సినిమా మార్చి నెలలో మొదలవుతుందనీ మహేష్ చెప్పారు.
కాగా, వీటి తర్వాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సినిమాల్లో మహేష్ నటిస్తారు. ఆ పైనే రాజమౌళి సినిమా ఉంటుందనీ సమాచారం.
Sunday, 3 February 2013
Mr Pellikoduku Audio Review
కామెడీ నుంచి హీరోగా టర్న్
తీసుకుని దూసుకుపోతోన్న సునీల్ - ఇషాచావ్లా జంటగా మెగా సూపర్‌గుడ్
ఫిలిమ్స్ పై.లిమిటెడ్ నిర్మిస్తున్న చిత్రం 'మిష్టర్ పెళ్లికొడుకు'.
ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్ నిర్మాతలు. ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్నారు.
దేవిప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో
విడుదలయ్యాయి. నాగచైతన్య సీడీలోగోను విడుదల చేశారు. ఆడియో సిడీలను
వి.వి.వినాయక్ ఆవిష్కరించి తమన్న, నాగచైతన్యకు అందజేశారు. ఈ సందర్భంగా
డైరెక్టర్ దేవిప్రసాద్ ఆసక్తికర విషయాలు చెప్పారు: ‘సౌత్ ఇండియాలో అగ్ర
నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలిమ్స్. ఇక్కడ ఎంతోమంది గొప్ప టెక్నీషియన్లు
పనిచేశారు. అలాంటి గొప్ప చరిత్ర ఉన్న సూపర్‌గుడ్ పతాకంలో నేను సినిమా
చేయడం ఆనందంగా ఉంది. ఈ బ్యానర్‌లో నేను 'నువ్వువస్తావని' సినిమాకు
కో-డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ సినిమాకి సంబంధించి మార్కులు వేయాల్సి వస్తే
ఫస్ట్ మార్కు సునీల్ డ్యాన్స్ కి పడతాయి. తొలి ప్రేక్షకుడిగా నేను
సునీల్ డ్యాన్సులను, పాటలను చాలా ఎంజాయ్ చేశాను. ఎస్.ఎ.రాజ్‌కుమార్‌తో
గతంలో నేను 'లీలామహల్ సెంటర్'కు పనిచేశాను. ఆయనకు నేను పెద్ద అభిమానిని.
యూత్‌తో పోటీపడాలని ఈ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చారు. ఫొటోగ్రఫీ అద్భుతంగా
ఉంటుంది. దర్శకుడిగా ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేసినా నేను ఆనందంగా
స్వీకరిస్తాను. 'తను వెడ్స్ మను' సునీల్‌తో ఎలా తీస్తారు అని చాలా మందికి
సందేహం కలిగింది. అది మల్టీప్లెక్స్ మూవీ కదా అని అన్నవారు కూడా ఉన్నారు. ఈ
సినిమాను చూస్తే ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. మేకింగ్‌పరంగా
నిర్మాతలు తమ సత్తాను మరోసారి చూపారు. వాకాడ అప్పారావుగారు లేకుంటే ఈ
సినిమానే లేదు. ఆయన ఈ సంస్థకు వెన్నెముక’ అని వెల్లడించారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘కోడి రామకృష్ణ దగ్గరదేవి, సాగర్‌గారి దగ్గర నేను పనిచేసేవాళ్లం. అప్పటి నుంచి మేం ఫ్రెండ్స్. ఈ సినిమా హిట్ కావాలి. కష్టానికి ఓ రూపం ఇవ్వాల్సి వస్తే సునీల్ బొమ్మను పెడితే సరిపోతుంది. ఈ షేప్‌కి రావడానికి తను ఎంతటి నరకం అనుభవించాడో అర్థమవుతోంది. హ్యాట్సాఫ్ టు హిమ్’ అన్నారు.
హీరో సునీల్ మాట్లాడుతూ ‘మిస్టర్‌పెళ్లికొడుకు అని పేరు పెట్టి హీరోని కామ్‌గా ఉండమన్నారు. అందాలరాముడు ఆర్తి పాత్రలాగే, ఇందులో ఇషా పాత్ర ఉంటుంది. నల్లమలుపు బుజ్జి చెప్పాడని ఈ సినిమా చూసి చేయడానికి ఒప్పుకున్నాను. మన కల్చర్‌కాని సబ్జెక్ట్‌ను మన కల్చర్‌లో ఒదిగిపోయేటట్టు చేసి సినిమా తీసిన దర్శకుడికి 100శాతం క్రెడిట్ దక్కుతుంది. అంతా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నారు’. అని కాంక్షించారు.
Saturday, 2 February 2013
Rana Comments On Samantha
వెండితెరమీదకి వచ్చిన అనతికాలంలోనే
టాలీవుడ్ లోనేకాదు బాలీవుడ్ లో సైతం తనకంటూ ఓ గుర్తింపుతెచ్చుకున్న యంగ్
హీరో, ఆరడుగుల పైచిలుకు అందగాడు మూవీ మొఘల్ మనువడు రానా దగ్గుబాటి. ఈ
కుర్రహీరో చేసిన సంచలన ప్రకటన ఏంటో చూద్దాం.. ‘ఇప్పటివరకూ నా జీవితంలో
సినిమాలు చూసిన తర్వాత ఇద్దరు హీరోయిన్స్ తో ప్రేమలో పడ్డాను. మొదటగా ‘క్షణ
క్షణం’ సినిమా చూసిన తర్వాత శ్రీ దేవితో ప్రేమలో పడ్డాను, ఆ తర్వాత ‘ఏ మాయ
చేసావే’ సినిమా చూసి సమంతతో ప్రేమ లో పడ్డాను. ఆ సినిమాలో సమంత సూపర్బ్ గా
ఉంటుందని’ జబర్దస్త్ ఆడియో వేడుకలో రానా సెలవిచ్చాడు. ఇక సిద్దార్థ్ వయసు
పెరుగుతున్నా ఇంకా యంగ్ గానే కనిపిస్తున్నాడు. జబర్దస్త్ హిట్ కావాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్నానని’ తెలిపాడు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ
సినిమాలో నిత్యా మీనన్, శ్రీహరి కీలక పాత్రలు పోషించారు.
ఇక, రానా- ప్రభాస్ అన్నదమ్ములుగా, టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘బాహుబలి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా కోసం ప్రభాస్ – రానా ఈ రోజు నుంచి కత్తి ఫైట్స్ నేర్చ్గుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అనుష్క కూడా కత్తి ఫైట్ నేర్చుకుంటోంది. ఈ సంగతిని రాజమౌళి ఇలా వివరించాడు. ‘ఈ రోజు ప్రభాస్ – రానాకి కత్తి ఫైట్ ట్రైనింగ్ మొదటి రోజు. వారున్న హైట్, పర్సనాలిటీకి ఎగురుతుంటే మనుషుల్లా అనిపించడం లేదు. వీరికి తగ్గట్టుగానే అనుష్క హైట్ కూడా 5′.10 కావడంతో వారికి సమానంగా ఉంది. ఈ ట్రైనింగ్ చాలా బాగుంది. కానీ సమస్య మొత్తం ఫోటోగ్రఫీ డైరెక్టర్ కే ఎందుకంటే వారిద్దరినీ ఒకే ఫ్రేంలో చూపించాలి కదా’ అని చలోక్తి విసిరాడు.
Subscribe to:
Posts (Atom)