ప్రస్తుతం టాలీవుడ్ లో యమ దూకుడు
ప్రదర్శిస్తోన్న హీరో ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు.
ఇప్పటివరకూ ఏ తరహా పాత్ర పోషించినా.... అందులో ఎంచక్కా ఒదిగిపోయే మహేష్
చేయాలనుకుంటున్న పాత్ర ఒకటుంది. అదే గతంలో తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ
'గూఢచారి 116' సినిమాలో పోషించిన పాత్ర.
అయితే, దీనికి మంచి కథ, దానిని అదే స్థాయిలో తెరకెక్కించగలిగే దర్శకుడు కుదరాలి. అవన్నీ కుదిరినప్పుడు నేను తప్పకుండా స్పైక్యారెక్టర్ చేస్తానంటున్నాడు మహేష్ . మరి మహేష్ ఇంత చక్కటి ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పుడు, మన యువ దర్శకులు కథలు సిద్ధం చేసుకుని ఆయనని సంప్రదించడమే ఇక తరువాయి కదా.. ఇదిలా ఉంచితే.. అప్పుడే మహేష్ మనసెరిగిన ఓ ప్రముఖ దర్శకుడు దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ సిద్ధం చేస్తున్నట్టు వినికిడి.
మరోవైపు.. రాజమౌళి దర్శకత్వంలో తాను నటించనున్నట్టు మహేష్ బాబు స్వయంగా ప్రకటించాడు. అయితే, ఇది కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కథ గురించి ఇప్పటికే తాము మాట్లాడుకున్నామని మహేష్ వెల్లడించారు అంతేకాదు ప్రస్తుతం తాను సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం జూన్ లో విడుదలవుతుందనీ.. శ్రీను వైట్లతో చేసే 'ఆగడు' సినిమా మార్చి నెలలో మొదలవుతుందనీ మహేష్ చెప్పారు.
కాగా, వీటి తర్వాత క్రిష్, వంశీ పైడిపల్లి, పూరీ జగన్నాథ్ సినిమాల్లో మహేష్ నటిస్తారు. ఆ పైనే రాజమౌళి సినిమా ఉంటుందనీ సమాచారం.
No comments:
Post a Comment