యంగ్ టైగర్ మూవీ బాద్ షా పలు అంశాల
ప్రాతిపదికన తరచూ వార్తల్లో నిలుస్తూ హల్ చల్ స్రుష్టిస్తోంది. క్రియేటివ్
డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్‌తో
తెరకెక్కుతున్న ఈమూవీలో హీరో నవదీప్ నెగెటివ్ రోల్ పోషిస్తున్న సంగతి
తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఏంటంటే, హీరో సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం.
తెలుగు మూవీ యువ హీరోలు ఇటీవల కొంతకాలంగా, అతిథి పాత్రల్లో కనిపించడానికి
ముందుకు రావటం శుభపరిణామం. ఇదే కోవలో 'ఎవడు'లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్
పోషిస్తుండగా, తులసిలో ఎన్టీఆర్ స్టెప్పులేసి అలరించిన సంగతి ఇక్కడ
గమనార్హం.
కాగా, బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడక నిర్మిస్తున్న 'బాద్‌షా'లో కాజల్ కథానాయికగా నటిస్తోంది. థమన్ స్వరాలిస్తున్నాడు.
...avnkకాగా, బండ్ల గణేష్ ఖర్చుకు వెనకాడక నిర్మిస్తున్న 'బాద్‌షా'లో కాజల్ కథానాయికగా నటిస్తోంది. థమన్ స్వరాలిస్తున్నాడు.
No comments:
Post a Comment