Monday, 4 February 2013

Rajamouli Risk For Bahubali

rakamouli

తెలుగు సినిమా చరిత్రలోనే దర్శకుడి గా దాదాపు 10 సంవత్సరాల ప్రస్తానం లో ఇంతవరకు పరాజయం చవి చూడని ఒకే ఒక్క దర్శకుడు, రాజ మౌళి... తన చేతి లో పడ్డ ప్రతీ నటుడు నటీమణి స్టార్లు గా ఎంతో పేరు ని మరిన్ని ఆఫర్లని సంపాదించుకున్నారు... రాజ మౌళి ఈగ ని కూడా స్టార్ గా మార్చే సత్తా ఉన్నవాడు అని మనకు రుజువయ్యింది...మరి ఈ సంవత్సరం, ఈ దర్శకుడు, కేవలం బాక్ష్ ఆఫీసు కలేక్షన్లనే దృష్టి లో ఉంచుకుని, ప్రభాస్ కధానాయకుడిగా, రాణా ప్రతినాయకుడిగా నిర్మిస్తున్న పీరియాడిక్ చిత్రం, 'బాహుబాళి'... చిత్రం టైటిల్ యెంత పవర్ఫుల్ గా ఉందొ చిత్రం కూడా అంతే పవర్ఫుల్ గా ఉంటుంది అని నమ్మకం వ్యక్తం చేస్తోంది రాజ మౌళి క్యాంప్... ఈ చిత్రం లో ప్రభాస్ కి అన్ని విధాలుగా తగిన జోడి అయిన అనుష్క కధానాయిక... అంతా బాగానే ఉంది, ప్రభాస్ రాణా కత్తి యుద్ధాలలో శిక్షణ తీసుకోవడం కూడా మొదలు పెట్టేసారు... వీరిరువురినీ చూసి మురిసిపోతున్నాడట రాజ మౌళి...

అయితే ఒక చిక్కు ఒచ్చి పడింది... హీరో, విలన్, హీరోయిన్, అందరు ఎత్తులో ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు... వీరు ముగ్గురిని ఒకే సారి క్యామెరా లో బంధించాలంటే మాత్రం, క్యామేరామ్యాన్ కి చుక్కలు కనిపించడం ఖాయం...ఈ చిక్కు ని రాజ మౌళి ఏ పై ఎత్తు వేసి తీరుస్తాడో  'బాహుబాళి' లో చూడలి మరి...

No comments:

Post a Comment