బాలీవుడ్లో ఇప్పటి హీరోయిన్లు అందరిలోనూ
ఒక ప్రత్యెక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్, దీపిక పాడుకొనే... అటు అందం,
ఇటు చక్కని దేహాక్రుతి, ఒడ్డు, పొడుగు, ఇటు అందాల ఆరబోతకీ, అటు నటనకి
ఆస్కారం ఉన్న పాత్రలు పోషించడం, ఇలా నేటి తరం ప్రేక్షకులకు ఏం అంశాలు
కావాలో, అవన్నీ పుష్కలంగా ఉన్న నటి, దీపిక...
దీనికి తోడూ, ఎప్పుడు వెన్నంటి ఉండే
అదృష్టం కూడా దీపిక సొంతం... సంవత్సరానికి కనీసం 3 సినిమాలు చేస్తూ బిజీ
గా గడిపే దీపిక, పోయిన సంవత్సరం కేవలం 1 సినిమాని మాత్రమె రిలీజ్
చెయ్యగలిగింది. అయితే నేఁ, ఈ లోటు భర్తీ చెయ్యడానికి ఈ సంవత్సరం ఏకంగా 4
సినిమాల రిలీజ్ ని లైన్లో పెట్టింది... రన్బీర్ కపూర్ తో తాను కలిసి
నటిస్తోన్న 'ఏ జవాని హే దివానీ', రన్వీర్ సింగ్ తో 'రామ్ లీల', షా రుఖ్
ఖాన్ తో 'చెన్నై ఎక్ష్ప్రెస్స్', రజనీ కాంత్ తో 'కొచ్చాడియాన్' లో
నటిస్తోంది దీపిక...
దాదాపు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ
చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే దీపిక
నటించిన రేస్ 2 చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది...ఇక ఏ ఇతర బాలీవుడ్ హీరోయిన్ చెయ్యని రీతిలో 4 సినిమాల్లో నటిస్తూ రికార్డ్ సృష్టిస్తోంది
దీపిక.
No comments:
Post a Comment