Tuesday 26 March 2013

Aamir Khan Steps Into A Woman Shoes Again

Movie news


Aamir Khan steps into a woman

వైవిధ్యమైన విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ ని బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అని అంటుంటారు. ఇతన్ని మిస్టర్ ఫర్ ఫెక్ట్ అని ఎందుకంటారంటే ఇతను ఎంచుకున్న పాత్రలు కానీయండి, వేసే గెటప్ లు కానీయండి , చేసే సినిమాలు కానీయండి ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి. గతంలో ఆడ వారి గెటప్ లో పర్ ఫెక్ట్ గా నటించగలను అని అమీర్ ఖాన్ ఇప్పటికే నిరూపించాడు. గతంలో ఆయన ‘బాజీ' అనే సినిమాలో క్యాబరే పాటలో అమ్మాయిగా నటించాడు. తాజాగా ఓ వాణిజ్య ప్రకటన కోసం అమీర్ ఖాన్ లేడీ అవతారం ఎత్తారు. ఇందులో ఆయన అచ్చమైన భారతీయ స్త్రీ గెటప్ లో కనిపించనున్నారు. 

ఈ లేడీ గెటప్ కోసం అమీర్ చాలా శ్రమ పడుతున్నాడట. రోజుకు రెండుసార్లు షేవింగ్ చేసుకోవడం, అమ్మాయిలాగా మేకప్ వేసుకోవడం ఇలా చాలా కష్టపడుతున్నాడట. ఈ లేడీ గెటప్ వేయడానికి ఓ ప్రముఖ మేకప్ ఆర్టిస్టునే తెప్పించుకున్నాడట. మరి ఈగెటప్ లో ఎలా కనిపించబోతాడో అని సినీ జనాలు ఆసక్తితో ఉన్నారట.

No comments:

Post a Comment