Tuesday 19 March 2013

NTR Baadshah Ban In Telangana


ntr

నానక్ రామగూడ లోని రామానాయుడు స్టూడియోలో నిన్న ఎన్టీఆర్ 'బాద్‌షా' ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఎన్టీఆర్ అభిమాని వరంగల్‌ జిల్లాకు చెందిన రాజు అనే వ్యక్తి మరణించాడు. అయితే రాజు మరణానానికి నిరసనగా  'బాద్‌షా' చిత్రాన్ని తెలంగాణ లో బ్యాన్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఎంపీ విజయశాంతి తెలిపారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా' చిత్రాన్ని తెలంగాణ ప్రాంతంలో ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆమె అన్నారు. ఆయన అభిమాని మరణిస్తే సంతాపం తెలపకుండా కార్యక్రమాన్ని కొనసాగించారని , అభిమానుల పట్ల హీరోలు చూపే అభిమానం ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్ చేశారు. ఈ సందర్భం గా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ తల్లికి కుమారున్ని ఇవ్వలేను కానీ, చనిపోయిన కుటుంబానికి పెద్దకుమారుడిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అభిమానులు ఇళ్లకు జాగ్ర త్తగా వెళ్లాలని అభిమాని మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆడియో ఆవిష్కరణ గురించి మాట మాత్రమైన మాట్లాడకుండా వెళ్లిపోయాడు. మరి అప్పటి వరకు ఈ విషయాన్ని తెలంగాన వాదులు గుర్తుపెట్టుకొని చిత్రానికి ఎన్ని అడ్డంకులు చేస్తారో అని నిర్మాత బండ్ల గణేష్ కి టెన్షన్ మొదలైందని అంటున్నారు.

No comments:

Post a Comment