Tuesday 19 March 2013

Salman Mental Worth Rs 130 Crores

Gossips
Salman Mental  movie

బాలీవుడ్ అంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ... చిన్న నిర్మాత దగ్గరి నుండి బడా నిర్మాత, పంపిణీదారులు కూడా, ఎక్కువ రిస్క్ లేకుండా తాము పెట్టిన పెట్టుబడి తమ సినిమా ఆర్జించి పెట్టాలి అంటే తప్పకుండా సల్మాన్ ఖాన్ ఏ తమ హీరో గా ఉండాలి అనుకునే స్తాయి కి, దాదాపు 20 ఏళ్ళ సినీ ప్రస్తానం తరువాత, సల్మాన్ ఖాన్ సొంతం చేసుకున్నాడు ... ఇక సల్మాన్ పని అయిపొయింది అనుకుంటున్న సమయం లో తెలుగు లో ఘన విజయం సాధించిన చిత్రం 'పోకిరి' కి రీమేక్ గా 'వాంటెడ్' లో హీరో గా నటించి మళ్ళీ విజయం తో విజ్రుంభించాడు ...

ఇక వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు సల్మాన్ కి ... ఒక్క చిత్రం, ఒకే ఒక్క చిత్రం 'దబంగ్' తో బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు కొట్టాడు సల్మాన్ ... ఇక వరుస విజయాలు ... సినిమా బాగున్నా, అంత బాగా లేకపోయినా, కధా - కధనం ఎలా ఉన్నా, సల్మాన్ చిత్రం అంటే, అది 100 కోట్ల కలెక్షన్ సాధించాల్సిందే ... ఇందుకు నిదర్సనం 'బాడీ గార్డ్', 'ఏక్ థా టైగర్', 'దబంగ్ - 2' వంటి చిత్రాల విజయాలు ... ఇప్పుడు సల్మాన్ 'మెంటల్' చిత్రం చేస్తున్న సంగతి, ఈ చిత్రం తెలుగు లో మెగా స్టార్ చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రానికి రీమేక్ అన్న సంగతి మనకు తెలిసిందే ...

ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఏంటంటే, ఇంకా సగం కూడా చిత్రీకరణ పూర్తీ అవ్వక ముందే ఒకానొక పంపిణీదారుడు ఈ చిత్రాన్ని 130 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నాడు ... అయితే ఇందుకు సల్మాన్ అన్న బ్ర్యాండ్ నేమ్ యెంత దోహద పడిందో, చిత్ర కధ కూడా అంతే ముఖ్యంగా నిలిచింది ... అంటే మన తెలుగు చిత్రం విలువ 130 కోట్లన్నమాట

No comments:

Post a Comment