Tuesday, 5 February 2013

Balayya Own Direction

 

 

balakrishna-1

       నందమూరి నటసింహం..  బాలకృష్ణ తెలుగుతెరమీద ఓ సరికొత్త సంచలనానికి శ్రీకారం చుడుతున్నాడు.  ఓ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించటమే కాదు.. ఏకంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. 'ది లయన్ కింగ్' అనే  హాలీవుడ్ మూవీ 1994లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మహారాజు పాత్రలోనూ, ఆయనకు జోడీగా నయనతార మహారాణి గానూ కనిపించనుంది. యలమంచిలి సాయిబాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుంది. 'శ్రీ రామరాజ్యం' సినిమాను కూడా యలమంచిలి సాయిబాబే  నిర్మించిన సంగతి మనకెరుకే.
  
    స్వయంగా నటసింహమే దర్శకత్వ భాద్యతలు చేపట్టడం ఈ సినిమాకే హైలెట్. గతంలో బాలకృష్ణ 'నర్తనశాల'తో దర్శకుడిగా అరంగేట్రం చేయాలనుకున్నారు. అయితే అందులో ప్రధాన పాత్రధారైన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది. +

      కాగా, టాలీవుడ్ లో విస్త్రుత స్థాయి చర్చకు తావిస్తోన్న ఈ భారీ మూవీ  జూన్ 10 వ తేదీ అంటే బాలయ్యబాబు జన్మదినం రోజున ఈ చిత్రం షూటింగు ప్రారంభంకాబోతోంది.
...avnk

No comments:

Post a Comment