అందాల భామ అనుష్కకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. అనుష్క తాజా సినిమా ‘రుద్రమదేవి’కి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రోజు కేసీఆర్ ను ‘రుద్రమదేవి’ సినిమా డైరెక్టర్ గుణశేఖర్ కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన రాణి రుద్రమదేవి కధను సినిమాగా తెరకెక్కించినందున.. తెలంగాణలో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
Click Here to View Full Story
No comments:
Post a Comment