మన రాష్ట్రాంలో ఇప్పుడు ‘రెడ్డి’ అనే
పదం రాజ్యం వేలుతుంది. రాజకీయ రెడ్డిలో ఏముందో తెలియాదు గానీ, సినిమా
రెడ్డిలో మాత్రం ఒక గమ్మత్తు ఉందని అంటున్నారు. ఇప్పుడు ఎవరైన ‘రెడ్డి’ అని
పిలిస్తే చాలు వారిలో ఉన్న బీపీ తగ్గిపోతుంది. అందరికి కాదులేండి.
అతికొద్దిమందికే ఈ అవకాశం ఉంటుందని ప్రముఖ నిర్మాత చెబుతున్నారు. రెడ్డి
అనే పిలుపులో అంతమహాత్యం ఉందా? అంటే ఉందనే చెబుతున్నారు. ఆ హీరోగారి
పిలుపుతో రెడ్డిగారిలో ఉన్న బీపి ఇట్టే తగ్గిపోతుందని ఆయనే స్వయంగా
చెబుతున్నారు. రెడ్డి గారు పేదల పాలిట దేవుడు అనే మాటలకు మనకు తరుచుగా
వినిపిస్తాయి. రెడ్డి వర్గం వర్గం అన్ని వర్గాలను కలుపుకోని పోవటంలో
నైపుణ్యం కలిగిన నాయకులు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు
రెడ్డి అనే మాట ఒక మందులా పనిచేస్తుందని ఒక సినీ నిర్మాత అంటున్నారు.
తాజాగా ఆడియో ఫంక్షన్ జరుపుకున్న ‘గ్రీకువీరుడు’
వేధికపై ఈ మాటలు వినిపించాయి. గ్రీకువీరుడు చిత్ర నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఆడియో ఫంక్షన్ వేధిక పై హీరో నాగార్జున ఆయనకు ఉన్నస్నేహ సంబంధం
గురించి చెప్పటం జరిగింది. ఆ సమయంలో నాగార్జున పిలిచే పిలుపు కోసం శివప్రసాద్ రెడ్డి ఎదురుచూస్తాడట. ‘రెడ్డి’ అని
నాగార్జున పిలిస్తే శివప్రసాద్ రెడ్డిలో ఉన్న బీపీ, అన్ని తగ్గిపోతాయాని
ఆయన చెబుతున్నారు. అంటే వారిద్దరి మద్య అంత అనుబంధం ఉందని తెలుస్తోంది.
అయితే మరుజన్మలో కూడా మా అనుబంధం ఇలాగే ఉండటాని శివప్రసాద్ రెడ్డి
కోరుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. టాలీవుడ్ లో నాగార్జునే అందరికి పులిహోర
తినిపిస్తాడైతే.. అలాంటి నాగ్ కే .. డి. శివప్రసాద్ పులిహోర తినిపించాడని
సినీ పెద్దలు గొణుక్కుంటున్నారు. ఆయనకు బీపీ పెరిగిన ప్రతిసారీ బీపి
టాబ్లేట్ బదులు ..నాగ్ ఫోన్ చేసి .. రెడ్డి గారు అని పిలిస్తే .. బీపి
తగ్గిపోతుందని సినీజనాలు జోకులు వేసుకుంటున్నారు. ఇలాంటి పులిహోర మాటలు
టాలీవుడ్ లో చాలా వినిపిస్తాయని ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు.
నాగార్జున మాత్రం రాబోయే రోజుల్లో రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పిలుకు బందీ అవుతాడో..లేక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపుకు బందీ
అవుతాడో చూడాలని .. నాగ్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.
No comments:
Post a Comment