ఇఫ్పటి వరకు సినీ ఇండస్ట్రీకి చాలా మంది
హీరో హీరోయిన్ల పిల్లలు తెరంగ్రేటం చేసి రాణిస్తున్నారు. కానీ మెగా హీరో
ఫ్యామిలీ నుండి హీరోలు ఎంట్రీ ఇచ్చారు కానీ, హీరోయిన్లు ఎవరూ ఎంట్రీ
ఇవ్వలేదు. తాజాగా ఫిలిం నగర్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా
తెరంగ్రేటం చేయబోతుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఆమె ఆలోచనకు కుటుంబ
సభ్యుల ప్రోత్సాహం కూడా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. గతంలో ఈమె నిర్మాతగా
అవతారం ఎత్తబోతుందని వార్తలు వచ్చాయి కూడా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే...
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చే సినిమాలో
హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు
అఖిల్ హీరోగా తెరంగ్రేటం చేసే సినిమా గానీ, దానికి సంబంధించిన ప్రకటన గానీ
వెలువడలేదు. ఒకవేళ వీరిద్దరు జంటగా తెరంగ్రేటం చేస్తే మాత్రం అభిమానుల్లో
వీరి సినిమా పై ఆస్తకి నెలకొనడం ఖాయంగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment