ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో వెరైటీ పాత్రలకు అధిక ప్రాధాన్యమిచ్చే నటుల్లో అక్కినేని నాగార్జున ముఖ్యులు. భక్తిరసమైనా, ఫ్యాషన్ ఒలికించే పాత్రైనా సరికొత్త పద్దతిలో ఆవిష్కరించేందుకు ఆయన ముందుంటారు. డాన్ సినిమాలో సరికొత్త మాఫియా డాన్ గా కనిపించినా, శిరిడీ సాయిలో భక్తితత్వాన్ని ప్రబోధించినా నాగ్ తరువాతే. తాజాగా నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘భాయ్’. దీనికి వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో 'భాయ్' గా నాగార్జున తాజా గెటప్స్ గురించి కొంతకాలంగా ఫిల్మ్ నగర్ కోడై కూస్తొంది.
దీనికి ఊతమిస్తూ ‘భాయ్’ సినిమా షూటింగ్ లో నాగార్జున విచిత్రమైన వేషధారణతో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో హాట్ బ్యూటీ నతాలియా కౌర్ తో నాగార్జున ఐటెం సాంగ్ చిత్రీకరణ సమయంలో విచిత్రమైన వేషధారణలో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈ షూటింగ్ లో అచ్చం కరుడుగట్టిన బ్రూనై సుల్తానును తలపిస్తూ నాగ్ అవతారం ఉంది. మెరూన్ కలర్ గౌనులాంటి డ్రెస్సులో చాతీ భాగం విశాలంగా కనిపించేలా, భుజాలు దాటే జట్టుపైన ఎర్రటి వస్త్రాన్నిచుట్టుకొని నాగ్ ఔరా అనిపించాడు.
నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియో బేనర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ కథానాయికగా నటిస్తోంది. ఈ వారాంతం వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ షెడ్యూల్ లో రిచా-నాగ్ మీద కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
...avnk
No comments:
Post a Comment