Wednesday, 15 May 2013

Pawan Kalyan Turns Singer Again

Pawan Kalyan Turns Singer Again

Pawan Kalyan Turns Singer Again.png

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో చాలా కళలు ఉన్నాయి. హీరోగానే కాకుండా సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. 

ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాట కూడా ఓ హైటెట్ గా చెబుతున్నారు. పవన్ సినిమా అంటే అభిమాన్లులో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పవన్ పాట పాడుతున్నాడని తెలియడంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా శరవేగంగా రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కుంది. మరి పవన్ పాట ఏమేరకు అలరిస్తుందో చూడాలి.

Shruthi Hassan Impress As Karanchi Prostitute

Shruthi Hassan Impress As Karanchi Prostitute

shruthi-hassan.gif

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్థానంలో ఉన్న భాగ్యలక్ష్మీ బరితెగించింది. నటనలో అంత మునిగిపోతే.. అసలకే ప్రమాదం వస్తుందని సినీయర్ నటీమణులు అనుభవంతో చెబుతున్నారు. డర్టీ హీరోయిన్ గా పేరు పడితే .. ఇక చేరిగిపోవటం చాలా కష్టమని ఆమె అభిమానులు చెబుతున్నారు. శృతిహాసన్ చేస్తున్న భంగిమలు చూస్తే .. సెక్సీ హీరోయిన్ అయిన షకీలాకే.. మంట మండే విధంగా శృతిహాసన్ ఈ భంగిమంలో లీనమైనట్లు తెలుస్తోంది. శృతిహాసన్ డి- డే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె కరాచీకి చెందిన వేశ్యగా కనిపిస్తోంది. అర్జున్ రాంపాల్ మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ చిత్రంలోని ఫోటో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందులోని సెక్సీ భంగిమ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏక్షన్ డ్రామాగా రూపొందుతున్న

actress shruthi hassan impress as karanchi prostitute

ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్స్ అదరకొడతాయంటున్నారు. పెద్ద తెరపై ఆ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయంటున్నారు. ఈ ఫోటో చూసిన వారు ఏ రేంజిలో ఇంటిమసీ సీన్స్ ఉన్నాయో అని ఊహించుకుంటున్నారు. ఈ చిత్రం తనకు అవార్డులు, పేరు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. కానీ శృతిహాసన్ లో ఇంత ‘బలుపు ’ ఉందా అని సినీ పండితులు అంటున్నారు. తండ్రి బాటలో నడుస్తుందని కమల్ హాసన్ అభిమానులు అనుకుంటే .. పొరపాటే, ఎందుకంటే తండ్రిని మించిన శృతిహాసన్ గా వెండితెరపై రొమాన్స్ భంగిమల్లో పండిస్తుందని,కమల్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.


ఈ భంగిమ చూసిన రసిక ప్రియులు మాత్రం .. భాగ్యలక్ష్మీ కి భలే ఛాన్సులే దొరికిందని, నటనతో పాటు రొమాన్స్ అనుభవం కూడా వస్తుందని , వారి రసిక బాషల్లో చెవులు కొరుకుంటున్నారు. ఈ భంగిమ ఫోటో ఇలా ఉంటే.. ఇక సినిమాలో ఎన్ని భంగిమల్లో శృతిహాసన్ రొమాన్స్ పండించిందోనని .. సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు. 

Veena Malik Rangeela Movie

Veena Malik Rangeela Movie

రంగీలా ’ రగిలించబోతుంది 

పాకిస్థాన్ హాట్ మోడల్ అయిన వీణా మాలిక్ ఇండియాకి వచ్చి హీరోయిన్ గా అవకాశాలు సంపాదిస్తూ, తన అంద చందాలతో కుర్రకారు హాట్ బీట్ ను పెంచుతున్న ఈ అమ్మడు త్వరలో తెలుగు తెర పై ప్రత్యక్షం కాబోతుంది. ఇటీవల ఈమె బాలీవుడ్ లో ‘జిందగీ 50-50 ’ సినిమాలో వేశ్య పాత్రలో నటించి ఆ సినిమాకు మంచి ఊపును తెచ్చింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో ‘రంగీల ’ పేరుతో విడుదల చేయబోన్నారు. మామూలు గానే కెమెరా ముందు భారీ అందాలతో మతి పోగొట్టే వీణా మాలిక్ వేశ్య పాత్రలో అయితే ఇంకా ఏ రేంజ్ లో ఆరబోస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి హాట్ భామ భారీ అందాలు చూడటానికి తెలుగు జనాల కళ్ళు సరిపోతాయో లేదో ?
 

Junior NTR Big Offier For PVR Cinemas

Junior NTR Big Offier For PVR Cinemas

junior ntr big offier for pvp cinemas.png

   తెలుగు సినిమా ఇండస్ట్రికి నందమూరి వంశం నుండి తెరంగ్రేటం చేసి, తిరుగులోని స్టార్ డమ్ ని సంపాదించుకున్న బుడ్డోడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదిస్తున్న ఎన్టీఆర్ సినిమాలు ఈ మధ్య కాలంలో స్టామినాకు తగ్గట్లు హిట్ కాలేదు. ఈ మధ్య వచ్చిన బాద్ షా కూడా మంచి విజయాన్నే సాధించినా కలెక్షన్ల విషయంలో కాస్తంత డల్ అయింది. 

ఈ నేపధ్యంలో మన బుడ్డోడు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా ఈయనకు ఏ సినిమా నిర్మాణ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇప్పటికే భారీ పారితోషికం తీసుకుంటూ అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ ఎన్టీఆర్ కు 50 కోట్ల రూపాయల ప్యాకేజీని పారితోషికం రూపంలో ఇచ్చేందుకు సిద్ధమయిందట. 

కానీ చిన్న కండీషన్ పెట్టిందట. ఈ యాభై కోట్ల డీల్ లో  ఈ సంస్థకు మూడు సినిమాలు చేసిపెట్టడమే కాకుండా, మూడు సినిమాలు అయిపోయేంత వరకు వేరే ప్రాజెక్టులు అంగీకరించవద్దట. అంటే ఒక్క సినిమాకు దాదాపు 16 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వజూపింది. అయితే ఇవన్నీ అయిపోవడానికి దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు పట్టవచ్చట. ఒకవేళ ఒప్పుకుంటే సినిమాలు ప్లాప్ అయితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ఎటూ తేల్చుకోలేక సతమతమౌవుతున్నాడట.

Iddarammayailatho Movie Postponed Again

Iddarammayailatho Movie Release Again Postponed

Iddarammayailatho movie release again postponed.png

   ప్రముక దర్శకుడు పూరీ జగన్నాథ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘ఇద్దరమ్మాయిలతో ’. ఈ సినిమా ఇప్పుడు వాయిద పడిందనే వార్తలు వస్తున్నాయి ఫిలింనగర్ నుండి. మొదట ఈ చిత్రాన్ని మే 9 విడుదల చేస్తారని ప్రకటించారు. తరువాత దాన్ని మే 24 కి వాయిదా వేశారు. ఇప్పుడు దానినే మే 31 ఇద్దరమ్మాయిలతో విడుదల చేయబోతున్నారని అంటున్నారు. 

ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకొని పొస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా వర్క్ కంప్లీట్ కాకపోవడమే వాయిదాకు కారణంగా చెబుతున్నారు. వ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. 

సినీ జనాలు మాత్రం ఈ సినిమా వాయిదా పై వేరేగా అనుకుంటున్నారు. మే 23న విడుదల చేస్తే ఐపీఎల్ కారణంగా కలెక్షన్లు తగ్గుతాయని, ఇప్పటికే బాద్ షా వంటి సినిమా కలెక్షన్లలో వీక్ అయిందని భావించిన నిర్మాత బండ్లగణేష్ దీనిని 31కి వాయిదా వేసాడని అంటున్నారు. మరి అప్పుడైనా విడుదల అవుతుందో లేదో చూడాలి.

Geetha Madhuri To Maary With Anand Krishna Nandu

Geetha Madhuri To Maary With Anand Krishna Nandu

Geetha madhuri to maary with Anand krishna nandu.png

బుల్లితెర పాటల పోటీల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యి, సినీ నేపథ్యగాయినిగా మారిన గీతా మాధురి గత కొన్ని రోజుల నుండి ఆమె 100% లవ్ చిత్రంలో సెకండ్ హీరోగా చేసిన ఆనంద్ కృష్ణ నందుతో  ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు మరో వార్త కూడా సంచరిస్తుంది సినీ వర్గాల్లో. త్వరలో గీతా మాధురి ఆ ప్రేమికుడితో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతుందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు దానికి పుల్ స్టాప్ పెట్టి, ఏడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చి, ఇంట్లో వాళ్లను ఒప్పించారని, వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా అభించిందని సమాచారం. .ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి ‘అదితి ' అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చెప్పుకున్నారు . 

త్వరలో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్త వెలువడవచ్చని అంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే గీతా మెడలో త్వరలో మూడు ముళ్లు పడనున్నాయన్న మాట. ఇక కెరిరీ పరంగా గీత గాయనిగానే కాకుండా నటిగా కూడా రాణించాలనే తపనతో ఉంది. .తెరపైనా ఛార్మింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న గీత నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ నూ ఆరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tuesday, 14 May 2013

Eega Be Screened At Cannes

Telugu Film Eega Be Screened At Cannes


కేన్స్ ఫెస్టివెల్ కి ‘ఈగ ’


eega be screened at cannes.png

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డుతో పాటు విజువల్ ఎఫెక్టు విభాగంలో పలు అవార్డులు దక్కించుకుంది. దీంతో ఆగకుండా ఎగురుకుంటూ పోయి అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈగ సినిమా కూడా వాలనుంది. ఈ చిత్రాన్ని త్వరలో జరగబోయే కేన్స్ లో ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు.

ఈ విషయాన్ని శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈగ ’ చిత్రంతో పాటు, ‘బహుబలి ’ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కేన్స్ ప్రదర్శించబోతున్నాం అని తెలిపాడు. ఒక తెలుగు సినిమా తొలిసారిగా కేన్స్ కు వెళ్లబోతుంది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్ర ధారులుగా రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రాపాటి నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.