Tuesday, 14 May 2013

Eega Be Screened At Cannes

Telugu Film Eega Be Screened At Cannes


కేన్స్ ఫెస్టివెల్ కి ‘ఈగ ’


eega be screened at cannes.png

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమా తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డుతో పాటు విజువల్ ఎఫెక్టు విభాగంలో పలు అవార్డులు దక్కించుకుంది. దీంతో ఆగకుండా ఎగురుకుంటూ పోయి అంతర్జాతీయ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈగ సినిమా కూడా వాలనుంది. ఈ చిత్రాన్ని త్వరలో జరగబోయే కేన్స్ లో ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు.

ఈ విషయాన్ని శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ఈగ ’ చిత్రంతో పాటు, ‘బహుబలి ’ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా కేన్స్ ప్రదర్శించబోతున్నాం అని తెలిపాడు. ఒక తెలుగు సినిమా తొలిసారిగా కేన్స్ కు వెళ్లబోతుంది. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్ర ధారులుగా రాజమౌళి దర్శకత్వంలో సాయి కొర్రాపాటి నిర్మించిన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment