Pawan Kalyan Turns Singer Again
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో చాలా కళలు ఉన్నాయి. హీరోగానే కాకుండా సింగర్ కూడా
అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి
సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్
దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట
పాడబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి.
ఇప్పుడు పవన్
కళ్యాణ్ పాట కూడా ఓ హైటెట్ గా చెబుతున్నారు. పవన్ సినిమా అంటే అభిమాన్లులో
విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు పవన్ పాట పాడుతున్నాడని తెలియడంతో ఈ
సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా
శరవేగంగా రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కుంది. మరి పవన్ పాట ఏమేరకు
అలరిస్తుందో చూడాలి.
No comments:
Post a Comment