Tuesday 7 October 2014

ప్రవాస తెలంగాణవారికోసం ప్రత్యేక శాఖ


తెలంగాణ ప్రజల సంక్షేమానికి రాష్ర్ట ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వారికే ఫలాలు దక్కాలనే లక్ష్యంతో పకడ్బందీ కార్యక్రమాలు చేపడుతోంది కూడా. తమ ఫలాలు రాష్ర్టంలోని తెలంగాణ ప్రజలకే కాకుండా.., విదేశాల్లో ఉన్న తెలంగాణవారికి కూడా అందించాలనుకుంటోంది. అందుకోసమే ప్రవాస తెలంగాణేయుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

ఇప్పటికే కేరళ, పంజాబ్ రాష్ర్టాలు విదేశాల్లో ఉన్న తమవారి కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ద్వారా పరాయిగడ్డపై ఉన్న తమవారి సంక్షేమం కోసం నిధులను కేటాయించటంతో పాటు వారి కోసం సహాయక కార్యక్రమాలను కూడ నిర్వహిస్తున్నాయి. అదే తరహాలో తెలంగాణ కూడా ప్రవాసీతెలంగాణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రెండు రాష్ర్టాల్లాగానే సంక్షేమ నిధి ఏర్పాటు, సహాయక కార్యక్రమాలు ప్రధాన ఎజెండాలుగా ఇది ఏర్పడనుంది. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతిపాదనపై చర్చ జరిపి మంత్రిత్వ శాఖకు సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది.


No comments:

Post a Comment