సాధారణంగా
నా సినిమాలెక్కువగా మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతాయి. కానీ ఈ సినిమా ఓ వింత
అనుభూతి నిచ్చింది. అదేంటంటే - ఇది ఫ్యామిలీస్‌కు కూడా బాగా నచ్చుతోంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా జయప్రకాశ్‌రెడ్డి కేరక్టర్‌ని బాగా
ఇష్టపడుతున్నారు. బ్రహ్మానందం డాన్స్ బిట్టయితే వాళ్లకి పిచ్చిపిచ్చిగా
నచ్చింది. ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్ అయితే ఆడవాళ్లకి చాలా బాగా నచ్చింది.
అందరికీ ఏకపక్షంగా నచ్చింది పోసాని కృష్ణమురళి కేరక్టర్. జనం ఆయన పాత్రని
బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యాక్షన్ పార్ట్ తప్ప మిగతా సినిమా అంతా నవ్వుతూ
ఎంజాయ్ చేశామనీ ఫ్యామిలీ ప్రేక్షకులు అంటున్నారు. యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయ్ అంటున్నారు. రాంచరణ్
రెండు పాత్రలూ బాగా చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. సినిమాలో తన
బావ చనిపోయినప్పుడు అతని పర్ఫార్మెన్స్ నాకు కన్నీళ్లు తెప్పించింది అని చెప్పారు వి.వి. వినాయక్. రాంచరణ్ ద్విపాత్రాభినయం చేయగా రూపొందిన 'నాయక్' చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేశారు. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించగా, యస్.
రాధాకృష్ణ సమర్పించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం దిశగా
దూసుకుపోతోంది. వినాయక్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... ఈ సినిమాతో
నేనేమనుకున్నానో వంద శాతం దాన్ని సాధించాను. నేనూహించిన దానికి మించి
ఆడవాళ్లకు కూడా బాగా నచ్చుతోంది. ఇండస్ట్రీలోని టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా
నిలుస్తుందని గట్టిగా చెప్పగలను. ట్రెమండస్ ఓపెనింగ్స్. మొదటి రోజు
రికార్డు కలెక్షన్లు వచ్చాయి.
అత్యధిక
థియేటర్‌లలో సినిమాని వేశారు. అందరికీ నచ్చింది. సంక్రాంతి చాలా ముందుగానే
వచ్చేసిందంటున్నారు. చిరంజీవి గారికి చాలా నచ్చింది. 'చాలా బాగా తీశావ్ వినయ్. అన్నీ కుదిరాయ్. చాలా అద్భుతంగా ఉంది' అన్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందినవారు చాలామంది 'సూపర్‌గా ఉంది' అన్నారు. అంతేకాకుండా కథలో నాకు ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా నచ్చింది. రెండు పాత్రలూ రూపంలో ఒకే విధంగా ఉన్నా, క్యారెక్టరైజేషన్
పరంగా వాటిలోని వేరియేషన్‌ను రాంచరణ్ చాలా బాగా ప్రదర్శించాడు. కోర్టు
బయటి సీన్‌లో క్లోజప్స్‌లో అతను ఎంత బాగా చేశాడంటే, తన కోసం జనం వస్తే, ఆ జనం మీద తనకున్న కృతజ్ఞతను తన కళ్లల్లో ఎంత బాగా అంటే అంత బాగా చూపించాడు. అదివరకు 'ఠాగూర్'ను చిరంజీవి గారితో చేసేప్పుడు చాలా టెన్షన్ పడేవాణ్ణి. ఇప్పుడు చరణ్‌ను చిరంజీవి గారిలాగే చూపించాలనుకున్నా. అందుకు తగ్గట్లే 'చరణ్ చాలా షాట్స్‌లో చిరంజీవిలాగే ఉన్నాడు' అని చాలామంది అంటున్నారు.
No comments:
Post a Comment