వేలాది మంది అభిమానులను చూసుకుని
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెచ్చిపోయాడు. లయబద్ధంగా డ్యాన్స్ చేసి,
అభిమానుల కరతాళ ధ్వనులు అందుకున్నాడు. ఈ అద్భుత సందర్భాలు 'నాయక్' సినిమా
విజయోత్సవ యాత్రలో ఆద్యంతం కనిపించాయి. ఒక్కరోజులోనే రాష్ట్రంలోని నాలుగు
ప్రధాన పట్టణాలలో నాయక్ టీం సుడిగాలిలా పర్యటించి సందడి చేసింది. మా
సందర్శకులకు ఇంతకుముందు వెల్లడించినట్టుగానే ముందుగా విశాఖలో ఈ యాత్ర
ప్రారంభమైంది. అక్కడి ఐనాక్స్ ధియేటర్ వద్దకి తరలి వచ్చిన వేలాది మంది
అభిమానుల ఉత్సాహం చూసి, పులకించిపోయిన రామ్ చరణ్... తను ప్రయాణిస్తున్న
వ్యాన్ నుంచి బయటకు వచ్చి... ఒక్కసారిగా టాప్ ఎక్కి ... నాయక్ సినిమాలోని
పాటకు లయబద్ధంగా డ్యాన్స్ చేసేశాడు. ఇదే సీన్ విజయవాడ, తిరుపతిలలో కూడా
రిపీట్ అయింది. అన్ని ప్రాంతాల్లో మెగా ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యారు.
అంతేకాదు తమ అభిమాన నటుడిని చూసిన అభిమానులు కేరింతలు, హర్షధ్వానాలతో
స్వాగతం పలకటమే కాదు. చిందులువేశారు.
ఇదిలా ఉండగా, 'నాయక్' సినిమా మీద గండి బాబ్జీ లేవనెత్తిన వివాదం పట్ల ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. జరిగిన సంఘటన కాకతాళియమే కానీ, దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలోని విలన్ కి కావాలనే తన పేరు పెట్టారంటూ విశాఖ జిల్లా మాజీ ఎం.ఎల్.ఎ. గండి బాబ్జీ గొడవకి దిగడం విచారకరమన్నారు. ఇది కేవలం కాకతాళీయంగా జరిగిందేనని దీనికి బాబ్జీ చింతిస్తే క్షమించాలని మీడియా ముఖంగా క్షమాపణలు తెలియజేశాడు.
కాగా, నాయక్ మూవీ విడుదలై పది రోజులు దాటినా నాయక్ సినిమా కలెక్షన్లు ఏ మాత్రం తగ్గటంలేదు. అయితే ఈ కలెక్షన్ల వివరాల పట్ల నిర్మాత దానయ్య ఏమాత్రం నోరు మెదపటంలేదు. కారణం ఆయన ఇంటిపై ఇటీవల జరిగిన ఐటీ దాడులే కారణమని తెలుస్తోంది. నాయక్ విజయయాత్ర చిత్రాలు మీకోసం..
....avnk
No comments:
Post a Comment