లక్షమందికి కౌగిలింతలు ఇచ్చింది
సినీ
ముద్దుగుమ్మలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయగానే
ఫాలోవర్లు కుప్పలు కుప్పులుగా వచ్చి చేరుతారు. అయితే వారు ఆమె పై ఉన్న
అభిమానంతో చేరుతారా లేక టైంపాస్ కి చేరుతారా అన్న విషయం ప్రక్కన పెడితే...
తాజాగా ‘ఆరెంజ్ ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన షాజన్ పదాంసీ ఈ మధ్యనే ట్విట్లర్లో ఖాతా తెరిచింది. ఖాతా తెరిచిన కొద్ది రోజులకే
ఈమెకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరారరట. దీంతో ఈ అమ్మడు తెగ సంబరపడిపోయి
ట్విట్లర్లో నన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య అప్పుడే అక్ష దాటేసింది. భలే
థ్రిల్లింగ్ గా ఉంది. నా అభిమానులు ఒక్కొక్కరికీ ఒక్కో కౌగిలింత చొప్పున
లక్ష కమ్మని కౌగిలింతలు ఇస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. ఈమె కౌగిలింతల్లో ఆ
లక్షమంది తడిసిపోయారట. ఇలా కౌగిలింతలు ఇస్తే మరో లక్షమంది చేరినా
ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు సినీ జనాలు.
No comments:
Post a Comment