Thursday 16 May 2013

Anchor Maria Rao For Gabbar Singh 2 Item Song

 Anchor Maria Rao For Gabbar Singh 2 Item Song
 
IPL Anchor Maria Rao for Gabbar Singh 2 item Song.png

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో ‘గబ్బర్ సింగ్ - 2’ చిత్రంలో సంపత్ నంది దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ప్రక్కన ఓ యాంకర్ నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్ ’లో కెవ్వు కేక అనే ఐటెం సాంగు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. 

ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఇందులో కూడా అలాంటి మసాలా కలిగిన ఓ ఐటెం సాంగు ఉండేలా చూసుకున్నాడట సంపత్ నంది. ఈ పాట కోసం ఓ కొత్త భామను ఎంపిక చేశాడట. ఆమె ఎవరో కాదు ఐపీఎల్ - 6 లో యాంకర్ గా అదరగొట్టిన రోచెల్లీ మారియా రావ్ ను ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతం కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో మల్లికా షెరావత్ ఐటెం సాంగులో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హట్ యాంకర్ ఐటెం భామగా ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

No comments:

Post a Comment