Wednesday 15 May 2013

Geetha Madhuri To Maary With Anand Krishna Nandu

Geetha Madhuri To Maary With Anand Krishna Nandu

Geetha madhuri to maary with Anand krishna nandu.png

బుల్లితెర పాటల పోటీల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యి, సినీ నేపథ్యగాయినిగా మారిన గీతా మాధురి గత కొన్ని రోజుల నుండి ఆమె 100% లవ్ చిత్రంలో సెకండ్ హీరోగా చేసిన ఆనంద్ కృష్ణ నందుతో  ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు మరో వార్త కూడా సంచరిస్తుంది సినీ వర్గాల్లో. త్వరలో గీతా మాధురి ఆ ప్రేమికుడితో పెళ్లి పీఠలు కూడా ఎక్కబోతుందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రేమాయణం సాగిస్తున్న వీరు దానికి పుల్ స్టాప్ పెట్టి, ఏడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చి, ఇంట్లో వాళ్లను ఒప్పించారని, వీరి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా అభించిందని సమాచారం. .ఈ మధ్యనే వీరిద్దరూ కలిసి ‘అదితి ' అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు చెప్పుకున్నారు . 

త్వరలో వీరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్త వెలువడవచ్చని అంటున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే గీతా మెడలో త్వరలో మూడు ముళ్లు పడనున్నాయన్న మాట. ఇక కెరిరీ పరంగా గీత గాయనిగానే కాకుండా నటిగా కూడా రాణించాలనే తపనతో ఉంది. .తెరపైనా ఛార్మింగ్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న గీత నెమ్మది నెమ్మదిగా హీరోయిన్ నూ ఆరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment