Friday 3 May 2013

Kajal 1.5 Crore For Gabbar Singh 2

Kajal 1.5 Crore For Gabbar Singh 2

Kajal asking 1.5 Crore for Gabbar Singh-2.png

టాలీవుడ్ లో పలువురు నాయికలు రేజింగ్ లో ఉన్నారు. ఈ భామలు ఏది పడితే అది బంగారం అవుతుంది. ఈ కోవలోకి కాజల్, తమన్నా, సమంతా, శ్రుతి హాసన్ లాంటి వాళ్లు వస్తారు. ఈ మధ్య కాజల్ అగర్వాల్ నటించిన తుపాకి,నాయక్, బాద్‌షా సినిమాలు హ్యాట్రిక్ విజయాలు సాధించాయి. దీంతో ఈ అమ్మడుకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్న కాజల్ తాజాగా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ చిత్రానికి సీక్వెల్‌ గా సంపత్‌నంది దర్శకత్వంలో పవన్ సరసన నటింపజేయమని నిర్మాతాలు అడిగితే ఈ అమ్మడు తన రేటును భారీగా పెంచేసిందట. పవన్ ఫ్రెండ్ అయిన శరత్‌మరార్ నిర్మించే ఈ సినిమా కోసం ఆమె కోటిన్నర డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాత ఒక్కసారి నోరెళ్లబెట్టాడట. మరి అంత రేటు చెల్లించి ఈమెను తీసుకుంటారో లేదో చూడాలి. ఇక గతంలో  ‘గబ్బర్‌సింగ్ ’లో నటించాల్సిన కాజల్ డేట్స్ సమస్య కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే.


No comments:

Post a Comment