Tuesday 14 May 2013

Sunny Leone Opposite Amitabh Bachchan In Welcome 2

Sunny Leone Amitabh Bachchan In Welcome 2


ఇండోకెనడియన్ పోర్న్ స్టార్ గా గుర్తింపు పొంది, బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టి, బాలీవుడ్ హీరోయిన్ గా మారి, ముంబయిలో మకాం పెట్టి హీరోయిన్లకే పోటీ ఇస్తున్న సన్నిలియోన్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతూ, నిద్ర లేకుండా చేస్తున్న ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సరసన సన్నిలియోన్ నటించడానికి సిద్ధం అయింది. అసలు విషయం ఏంటేంటే... 2007 సంవత్సరంలో వచ్చిన ‘వెల్ కమ్ ’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు. ఈ సినిమాలో ఆ సినిమాలో ఫిరోజ్ ఖాన్ పోషించిన పాత్రలో అమితాబ్ ని తీసుకున్నారు. ఇక మల్లికా షెరావత్ పోషించిన పాత్రలో సన్నీని తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 

దీని కోసం సన్నీకి ఏకంగా 5 కోట్ల రూపాలయలు కూడా ముట్టజెప్పడానికి సిద్దమయ్యారట దర్శక నిర్మాతలు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ జనాలు ఒక్క సారి షాక్ తినడమే కాకుండా, అమితాబ్ తో చిందులేసే అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కుందని అనుకుంటున్నారు. మరి అంత రెమ్యునరేషన్ ఇచ్చి పెట్టుకుంటున్నారంటే ఆ సినిమాలో సన్నీ ఏ రేంజ్ లో చూపించబోతుందోనని జనాలు ఎదురు చూస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న మిగతా హాట్ భామలకు మింగుడు పడటం లేదట.

No comments:

Post a Comment