Tuesday 14 May 2013

Mayabazar Is First Place In CNN IBN Channel Poll


Mayabazar Is First Place In CNN IBN Channel Poll


భారతీయ సినిమా ఇండస్ట్రీ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వందేళ్ళ కాలంలో ఈ రంగుల ప్రపంచం ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ఈ వంద సంవత్సరాలలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు వచ్చాయి. ఎంతో మంది గొప్ప గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ చరిత్రలో అత్యధ్బుత ద్రుశ్య కావ్యంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘మాయాబజార్ ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ భాషలన్నింటిలో వచ్చిన మహా మహా చిత్రాలను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. జాతీయ వార్తా ఛానల్ -  ఐబీఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ పోల్ లో ఈ సినిమాకే పట్టం కట్టారు. 1957లో తొలిసారిగా తెలుగులో విడుదల అయిన ఈ చిత్రం 23.91 శాతం ఓట్లను సంపాదించుకుంది. ఆ తరువాత పలు భాషల్లో రీమేక్ చేశారు.

ప్రముఖ నిర్మాతలు అయిన చక్రపాణి, నాగిరెడ్డి నిర్మించిన ఈ సినిమా అప్పటి నటులందరి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. ఈ పోల్ లో ప్రముఖ నటి శోభన నటించిన తమిళ చిత్రం ‘మనిచిత్రరాజు ’ రెండో స్థానంలో నిలిచింది. మమ్మూట్టికి అవార్డు తేవడమే కాకుండా హీరోగా తానేంటో చూపించిన మరో మళయాళ చిత్రం ‘ఓరు వడక్కన్ వీరగాథ ’ మూడో స్థానంలో నిలిచింది. రాంగోపాల్‌ వర్మ శివ.. 7 స్థానాన్ని దక్కించుకుంది. టాప్‌ 100 సినిమాల్లో తెలుగువారి ఆణిముత్యాలు అనదగ్గ పలు సినిమాలు స్థానం సంపాదించుకున్నాయి. హిందీలో సంచలన విజయం సాధించిన ‘షో ’ లే సినిమా టాప్ టెన్ లో స్థానం దక్కించుకుంది. ఇంకా పథేర్ పాంచాలి, నాయగన్, దిల్ వాలే దుల్హనియా లేజాయింగే లు టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నాయి. ‘మాయా బజార్ ’ మొదటి స్థానం దక్కించుకుందంటే... ప్రతి తెలుగు వాడు గర్వించదగిన విషయం.

No comments:

Post a Comment